కొత్త సరుకు


కిట్‌క్యాట్‌తో శామ్‌సంగ్ స్టార్-2

 

లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్‌తో పనిచేసే మరో స్మార్ట్‌ఫోన్‌ను శామ్‌సంగ్ కంపెనీ భారత్‌లో ప్రవేశపెట్టింది. ‘స్టార్-2’ ప్లస్‌గా పిలుస్తున్న ఈ తాజా స్మార్ట్‌ఫోన్ ధర రూ.7335. గెలాక్సీ స్టార్-2 అప్‌గ్రేడ్ మాదిరిగా లభిస్తున్న ఈ ఫోన్ 4.2 అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్ కలిగి ఉంది. ప్రాసెసర్ వేగం 1.2 గిగాహెర్ట్జ్ (డ్యుయెల్‌కోర్) కాగా, ర్యామ్ 512 ఎంబీ. ప్రధాన కెమెరా సామర్థ్యం మూడు మెగాపిక్సెళ్లు. ఎల్‌ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ కెమెరా ఏదీ దీంట్లో లేదు. ఫోన్ మెమరీ నాలుగు జీబీలైనప్పటికీ మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 32 జీబీల వరకూ పెంచుకోవచ్చు. త్రీజీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 1800 ఎంఏహెచ్.

 

సెల్‌కాన్ మిలీనియం వోగ్..

 

కేవలం 7.9 మిల్లీమీటర్ల మందం... 1.2 క్వాడ్‌కోర్ ప్రాసెసర్.. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ కిట్‌క్యాట్.. ఇవీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెల్‌కాన్ కంపెనీ తాజాగా విడుదల చేసిన మిలీనియం వోగ్ క్యూ455 స్మార్ట్‌ఫోన్ విశేషాలు. మోటరోలా ఇటీవల విడుదల చేసిన మోటో-ఈ ఫీచర్లను పోలిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రత్యేక ఆకర్షణ 16 జీబీల ఇంటర్నల్ మెమరీ. ఎస్‌డీ కార్డు ద్వారా దీన్ని 64 జీబీల వరకూ పెంచుకోగలగడం మరో విశేషం. ఫొటోల కోసం 8 మెగాపిక్సెళ్ల ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం 1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు ఉన్నాయి. స్క్రీన్ సైజు 4.5 అంగుళాలు. బ్యాటరీ సామర్థ్యం 2000 ఎంఏహెచ్. ధర రూ.7999.

 

ఓబీ ఆక్టోపస్ ఎస్ 520

 

ఆపిల్ కంపెనీ మాజీ సీఈవో జాన్ స్కలీ స్థాపించిన కొత్త కంపెనీ ఒబీ తాజాగా భారత మార్కెట్‌లో అక్టోపస్ ఎస్ 520 పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్, 1.7 గిగాహెర్ట్జ్ అక్టాకోర్ ప్రాసెసర్ దీని ప్రత్యేకతలు. ఇక ఇతర ఫీచర్ల విషయానికొస్తే... ఆక్టోపస్ ఎ520 దాదాపు 5 అంగుళాల స్క్రీన్, 1280 బై 720 పిక్సెల్ రెజల్యూషన్ కలిగి ఉంది. ఒక సాధారణ సిమ్, ఒక మైక్రోసిమ్‌ను సపోర్ట్ చేయగలదు. కిట్‌క్యాట్‌తో నడుస్తున్నప్పటికీ  వన్ జీబీ వరకూ ర్యామ్‌ను ఏర్పాటు చేయడం వల్ల మల్టీటాస్కింగ్ మరింత వేగంగా జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఎనిమిది గిగాబైట్ల ఇంటర్నర్ మెమరీని ఎస్‌డీ కార్డు ద్వారా 32 జీబీల వరకూ పెంచుకోవచ్చు. ప్రధాన కెమెరా ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో వస్తుంది. రెజల్యూషన్ 8 ఎంపీ. ఫ్రంట్ కెమెరా 2 ఎంపీ సామర్థ్యం కలిగి ఉంది. ప్రాక్సిమిటీ, ఆక్సెలరోమీటర్ సెన్సర్లు కూడా ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 1800 ఎంఏహెచ్. దీంతో నాలుగు గంటల టాక్‌టైమ్, 180 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుందని కంపెనీ అంటోంది.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top