పొడగరులకు కేన్సర్ ముప్పు ఎక్కువట! | The length to higher cancer risk | Sakshi
Sakshi News home page

పొడగరులకు కేన్సర్ ముప్పు ఎక్కువట!

Jan 9 2016 12:58 AM | Updated on Sep 3 2017 3:19 PM

పొడగరులకు కేన్సర్ ముప్పు ఎక్కువట!

పొడగరులకు కేన్సర్ ముప్పు ఎక్కువట!

ఆకర్షణీయంగా కనిపించే పొడగరులను అందరూ అబ్బురంగా చూస్తారు గానీ,

పరిపరి... శోధన

ఆకర్షణీయంగా కనిపించే పొడగరులను అందరూ అబ్బురంగా చూస్తారు గానీ, వారికి కేన్సర్ ముప్పు పొంచి ఉంటుందట! ఎదుగుదలను కుదించుకున్నట్లు కనిపించే పొట్టివాళ్లకు ఇలాంటి ప్రమాదమేదీ లేదట! పొట్టిగా ఉండటమా, పొడవు పెరగడమా అనేది మన చేతుల్లో లేదు. అంతా జన్యువుల మహిమ. అయితే, పొట్టి వాళ్లతో పోలిస్తే, కేన్సర్ సోకే ముప్పు పొడగరులకే ఎక్కువగా ఉంటుందని స్వీడిష్ పరిశోధకులు చెబుతున్నారు.

సగటు ఎత్తు కంటే అదనంగా పెరిగే పది సెంటీమీటర్లకు ఈ ముప్పు గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు. అదనంగా పది సెంటీమీటర్ల ఎత్తు ఉండే మహిళలకు ఈ ముప్పు 18 శాతం మేరకు, పురుషులకు 11 శాతం మేరకు ఎక్కువగా ఉంటుందని తమ అధ్యయనంలో తేలిందని స్టాక్‌హోమ్ వర్సిటీకి చెందిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement