
కథకుడు, సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్య శర్మ తన ఇద్దరు అబ్బాయిల పెళ్లిళ్లు ఒకేసారి చేశారట. పెళ్లి పత్రికలు వేయించి ఇవ్వడానికి ఒక మిత్రుని ఇంటికి వెళ్లారు. ఇవ్వడంలో కొంచెం ఆలస్యమైంది. దానికి వివరణగా– ‘‘ఫస్ట్ ఎడిషన్ అయిపోతే మరో ఎడిషన్ వెయ్యవలసి వచ్చింది’’ అని జోక్ చేశారట పురాణం. ‘‘నా రచనల్లో ఇప్పటివరకూ సెకండ్ ఎడిషన్‌కి వచ్చింది ఈ శుభలేఖే’ అని కూడా ముక్తాయించారు.