అలా... వద్దండోయ్! | study | Sakshi
Sakshi News home page

అలా... వద్దండోయ్!

Apr 7 2015 10:42 PM | Updated on Oct 3 2018 6:52 PM

అలా... వద్దండోయ్! - Sakshi

అలా... వద్దండోయ్!

మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం అనేది వృద్ధుల్లోనే కాదు యువతలో కూడా ఉంటుంది

స్టడీ

మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం అనేది వృద్ధుల్లోనే కాదు యువతలో కూడా ఉంటుంది. చిన్న చిన్న విషయాలను కూడా మరచిపోవడం అనేది జరుగుతుంటుంది. జ్ఞాపకశక్తి లోపించడానికి చెప్పుకునే ‘నిర్దిష్టమైన కారణాలు’ జాబితాలో కొత్తవి కూడా చేరుతున్నాయి.

తాజా విషయం ఏమిటంటే, జంక్ ఫుడ్ తినడం అనేది జ్ఞాపకశక్తిపై ప్రతికూలమైన ప్రభావం చూపుతుందని ఒక అధ్యయనం తెలియజేస్తుంది.  యూనివర్శిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.
 ‘‘ప్రతి రోజు జంక్‌ఫుడ్ తినడం వల్ల... జస్ట్ ఒక వారం వ్యవధిలోనే దాని ప్రభావం జ్ఞాపకశక్తిపై ప్రతికూలంగా ఉంటుంది’’ అంటున్నారు పరిశోధకులు. కొన్ని ఎలుకలపై తమ ప్రయోగాన్ని నిర్వహించారు.

కొసరు

చైన్ స్మోకర్లు మాత్రమే కాదు... అప్పుడప్పుడూ సిగరెట్లు తాగే వారి జ్ఞాపకశక్తిపై కూడా పొగతాగడం అనేది ప్రతికూల ప్రభావం చూపుతుందని కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధన చెబుతుంది. మెదడుకు చేరే ఆక్సిజన్ పరిమాణాన్ని ధూమపానం తగ్గించడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందంటున్నారు పరిశోధకులు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement