శృతి మించింది! | sonakshi sinha song on IIFA | Sakshi
Sakshi News home page

శృతి మించింది!

Jun 28 2015 11:14 PM | Updated on Sep 3 2017 4:32 AM

శృతి మించింది!

శృతి మించింది!

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ(ఐఐఎఫ్‌ఎ) ఉత్సవాల్లో ఏ ముహూర్తాన సోనాక్షి పాట పాడిందోగానీ, ఇక అప్పటి నుంచి పాటలతో పీకలలోతు ప్రేమలో పడిపోయింది...

ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ(ఐఐఎఫ్‌ఎ) ఉత్సవాల్లో ఏ ముహూర్తాన సోనాక్షి పాట పాడిందోగానీ, ఇక అప్పటి నుంచి పాటలతో పీకలలోతు ప్రేమలో పడిపోయింది. సోనాక్షి పాడిన పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘వన్స్‌మోర్’ అన్నవాళ్లు కూడా లేకపోలేదు. ఇక అప్పటి నుంచి తన గానప్రతిభ మీద ఆమెకు గట్టి నమ్మకం ఒకటి ఏర్పడి పోయింది.

ఇక చూసుకోండి...
వినేవాళ్లు దొరికితే చాలు పాటలు వినిపిస్తుందట.
‘‘ఈ పాట మొన్ననే వినిపించావుగా...’’ అని శ్రోత బాధితులు తప్పించుకో జూస్తే-
‘‘అలాగా... అయితే నిన్న నేర్చుకున్న కొత్త పాట వినిపిస్తాను’’ అని గొంతు సవరిస్తుందట.
ఎప్పుడూ గలగలా మాట్లాడే అమ్మాయి కాస్తా... తనలోనే తాను పాడుకుంటోందట. ఎవరైనా  పలకరిస్తే పొడిపొడిగా మాట్లాడి మళ్లీ తనలో తాను పాటలు పాడుకుంటుందట.
ఆనాటి ‘మొఘల్-ఏ- ఆజామ్’ పాటల నుంచి, ‘ఎవ్రీటైమ్ వుయ్ సే గుడ్‌బై’ లాంటి పాత ఇంగ్లీష్ పాటల వరకు తెగ పాడేస్తుందట.
శ్రద్ధాకపూర్‌ను స్ఫూర్తిగా తీసుకొని సినిమాల్లో కూడా పాడడానికి శ్రద్ధగా ప్రయత్నిస్తుందట సోనాక్షి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement