దానిమ్మతో ఎన్నెన్నో మేళ్లు! | Pomegranate many mellu! | Sakshi
Sakshi News home page

దానిమ్మతో ఎన్నెన్నో మేళ్లు!

Jul 20 2016 11:57 PM | Updated on Sep 4 2017 5:29 AM

దానిమ్మతో ఎన్నెన్నో మేళ్లు!

దానిమ్మతో ఎన్నెన్నో మేళ్లు!

ఏజింగ్‌తో కనిపించే శరీరక పరిణామాలు కనపడకూడదని కోరుకుంటున్నారా? కాలం గడుస్తున్న అదే యౌవనంతో ఉండాలని

పరి పరిశోధన
 
ఏజింగ్‌తో కనిపించే శరీరక పరిణామాలు కనపడకూడదని కోరుకుంటున్నారా? కాలం గడుస్తున్న అదే యౌవనంతో ఉండాలని భావిస్తున్నారా? దానిమ్మపండు తినండి. ఇందులో ఉన్న అద్భుతమైన రసాయనాలు చాలా మేలు చేస్తాయి. వయసు పెరుగుతున్నప్పుడు కండరాల బలాన్ని సడలనివ్వకూడా చూస్తాయి. అదే కండరాల  బిగువును చాలా కాలం కొనసాగనిస్తాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. దానిమ్మలో ఉండే ‘యురోలిథిన్-ఏ’ అనే మాలెక్యూల్ వయసు పెరుగుతున్నప్పుడు కలిగే దుష్పరిణామాలను నివారిస్తుంది. అంతేకాదు అంతేకాదు కణాల పనితీరు కాస్త తగ్గిన మొదట ఉన్నట్లే వాటిని రీఛార్జ్ చేస్తాయి. అంతేకాదు దానిమ్మలో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే గుణం కూడా ఉంది.

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనాల్లో రోజూ దానిమ్మను తినేవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పాటు అనేక రకాల క్యాన్సర్లు నివారితమవుతుందని తెలిసింది. ‘యురోలిథిన్-ఏ’ క్యాన్సర్ కణాలను అడ్డగించడానికి కూడా ఉపయోగపడుతుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. దానిమ్మలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే గుణం ఉందనీ, పార్కిన్‌సన్స్ వ్యాధిని సైతం మరో అధ్యయనంలో తేలింది. అంతేకాదు... అది గుండెజబ్బుల ముప్పులనూ నివారిస్తుందన్న విషయం గతేడాది ప్రచురితమైన అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో నమోదైంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement