మధుమేహులూ... కాలేయం జాగ్రత్త!!

People with diabetes must be more careful with liver tests - Sakshi

మధుమేహంతో బాధపడుతున్న వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్నది శాస్త్రవేత్తలు చాలాకాలంగా చెబుతున్న విషయమే. క్వీన్‌ మేరీ యూనివర్శిటీ, గ్లాస్‌గౌ యూనివర్శిటీలు ఈ జాబితాకు ఇంకో సమస్యను చేర్చారు. టైప్‌ –2 మధుమేహం ఉన్న వారిలో అత్యధికులు కాలేయ సంబంధిత లివర్‌ సైరోసిస్‌ లేదా కేన్సర్‌ బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఈ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు చెబుతున్నరు. యూరప్‌లోని దాదాపు కోటీ ఎనభై లక్షల మంది నుంచి వివరాలు సేకరించి విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త విలియం అలజవాయి తెలిపారు.

నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌ అనేది వందలో పాతిక మందికి వచ్చే వ్యాధే అయినప్పటికీ దీనికి టైప్‌ –2 మధుమేహానికి మధ్య దగ్గరి సంబంధం ఉందని... చాలా సందర్భాల్లో దీన్ని ఎవరూ గుర్తించరని ఆయన వివరించారు. ఈ పరిస్థితుల్లో ఈ వ్యాధి కాస్తా ముదిరి కాలేయం దెబ్బతినేందుకు కారణమవుతుంది. సకాలంలో ఇలాంటి రోగులను గుర్తించగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో మధుమేహం ఉన్న వారు మరింత జాగ్రత్తగా కాలేయ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని తమ అధ్యయనం చెబుతోందని ఆయన వివరించారు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top