ఉబ్బసానికి విరుగుడు  మితాహారమా?

People with asthma may be relieved by taking less calories - Sakshi

ఉబ్బసంతో బాధపడేవారు వీలైనన్ని తక్కువ కేలరీలను తీసుకోవడం ద్వారా వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చునని అంటున్నారు హాప్కిన్స్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు. అంతేకాకుండా శరీరానికి అందే కేలరీలు కొవ్వుల నుంచి వచ్చినా.. చక్కెరల నుంచి వచ్చినా ఈ ఫలితాల్లో తేడాలేవీ ఉండవని వారు ఎలుకలపై జరిపిన పరిశోధనల ఆధారంగా చెబుతున్నారు. అధికాహారం కారణంగా ఊబకాయులైన వారి ఊపిరితిత్తులు మంట/వాపులకు గురవుతాయని.. ఫలితంగా ఉబ్బస లక్షణాలు కనిపిస్తాయని.. మంట/వాపు నివారణకు మందులు వేసుకుంటే పరిస్థితి సాధారణమవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త వసెవోలోడ్‌ పొలోట్స్‌కీ అంటున్నారు.

ఎలుకలకు తాము నాలుగు రకాల ఆహారాన్ని అందించి వాటిపై పరిశీలనలు జరిపామని, ఎనిమిది వారాల తరువాత తక్కువ కేలరీలు తీసుకున్న ఎలుకల ఊపిరితిత్తుల పనితీరు మెరుగ్గా ఉన్నట్లు తెలిసిందని, కొవ్వు ఎక్కువగా తీసుకున్న ఎలుకల ఊపిరితిత్తుల్లోని వాయుమార్గాలు సాధారణం కంటే చాలా రెట్లు కుంచించుకుపోయినట్లు తెలిసిదని వివరించారు. దీన్నిబట్టి మితాహారానికీ ఊబ్బస లక్షణాలకూ మధ్య సంబంధం ఉన్నట్లు తాము అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఉబ్బసం వ్యాధికి మరింత మెరుగైన చికిత్స కల్పించేందుకు తమ పరిశోధన ఉపయోగపడుతుందని అన్నార 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top