అక్టోబర్ 11న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు | On October 11, a birthday celebration Celebrities | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 11న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

Oct 11 2015 12:49 AM | Updated on Sep 3 2017 10:44 AM

అక్టోబర్  11న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

అక్టోబర్ 11న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకునే వారి సంవత్సర సంఖ్య 2.

ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: అమితాబ్ బచ్చన్ (నటుడు),
 రోనిత్ రాయ్ (నటుడు)

 
 ఈ రోజు పుట్టిన రోజు జరుపుకునే వారి సంవత్సర సంఖ్య 2. ఇది. చంద్రునికి సంబంధించిన సంఖ్య, పుట్టిన తేదీ 11. ఇది రెండు సూర్యసంఖ్యల కలయికతో ఏర్పడిన చంద్రసంఖ్య కావడం వల్ల ఇది న్యూమరాలజీలో మాస్టర్ నంబర్. దీని వల్ల ఊహాశక్తి, ఆదర్శభావాలు, ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలు స్వతఃసిద్ధంగా అబ్బుతాయి. సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. వీరిపై సూర్య, చంద్రుల ఇద్దరి ప్రభావం ఉండడం వల్ల ఈ సంవత్సరం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. గత సంవత్సరం చేపట్టిన ప్రాజెక్టులు, ప్రణాళికల నుంచి మంచి లాభాలను ఆర్జిస్తారు. నలుగురినీ కలుపుకుంటారు. కొత్త కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానంతో టీమ్ వర్క్‌తో పనులను చురుకుగా చేస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు కలిసి వస్తాయి. విందువినోదాలకు, సంఘజీవనానికి మొగ్గు చూపుతారు. ఉద్యోగం మారే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు జీతాల పెంపు, ప్రమోషన్లు ఉంటాయి. పాతస్నేహితులను కలుసుకుంటారు. అవివాహితులకు వివాహం, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతాయి. అయితే సూర్య, చంద్రుల ప్రభావం వల్ల నేత్రవ్యాధులు, హృద్రోగాలు, మానసిక అస్థిరత, అస్థిమితత్వం ఉండే అవకాశం ఉన్నందువల్ల తగిన జాగ్రత్త తీసుకోవడం మంచిది.

 లక్కీ నంబర్స్: 2,5,6,7; లక్కీ కలర్స్: రెడ్, వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డెన్, శాండల్, ఆరంజ్; లక్కీ డేస్: సోమ, శుక్ర, ఆదివారాలు; సూచనలు: రోజూ రాత్రిపూట కనీసం ఒక అరగంటపాటు వెన్నెలలో విహరించడం, నవగ్రహాభిషేకం, అనాథ శరణాలయాల్లో పాయసం దానం చేయడం, దర్గాలు, చర్చ్‌లలో అన్నదానం చేసి, పిల్లలకు, వృద్ధులకు తీపి తినిపించడం మంచిది.
 - డాక్టర్ మహమ్మద్ దావూద్,
 ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement