జూన్ 9న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | On June 9, the birthday celebrated | Sakshi
Sakshi News home page

జూన్ 9న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Jun 9 2015 6:54 AM | Updated on Sep 3 2017 3:26 AM

జూన్ 9న  పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

జూన్ 9న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 5. వీరికి ఈ సంవత్సరమంతా అభివృద్ధి దాయకంగా ఉంటుంది.

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
కిరణ్‌బేడి (మాజీ ఐపిఎస్ అధికారి),
సోనమ్ కపూర్ (నటి)
 

 ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 5. వీరికి ఈ సంవత్సరమంతా అభివృద్ధి దాయకంగా ఉంటుంది. ధైర్యం, సాహనం, సమయస్ఫూర్తిని ఉపయోగించి పనులు చేస్తారు. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలన్న కోరిక నెరవేరుతుంది. కొత్త వ్యాపారాలు, ప్రాజెక్టులు స్థాపిస్తారు. రిస్క్‌తో కూడుకున్న పనులు చాలా చాకచక్యంగా, నైపుణ్యంగా పూర్తి చేస్తారు. శుభపరిణామాలు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఇది చాలా మంచి సమయం. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. ప్రభుత్వ పాలన, రక్షణ రంగాలలో ఉన్న వారు, యూనిఫారమ్ ధరించి చేసే వృత్తి, ఉద్యోగాలలో ఉన్నవారికి చాలా ప్రోత్సాహవంతంగా ఉంటుంది. లక్కీనంబర్స్: 1,5,6,9; లక్కీడేస్: మంగళ, బుధ, శుక్రవారాలు; లక్కీ కలర్స్: రెడ్, గ్రీన్, పర్పుల్, ఎల్లో
 సూచనలు: దూకుడును, అహంకారాన్ని, అత్యుత్సాహాన్ని తగ్గించుకోవడం, ఆంజనేయస్వామికి సింధూరం లేదా వెన్నతో అలంకారం చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవడం, రక్తదానం చేయడం, తోబుట్టువులకు అండగా నిలవడం, వికలాంగులకు అన్నదానం చేయడం.
 - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు
 
 

Advertisement
 
Advertisement
Advertisement