గీత స్మరణం | Notch smaranam | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Dec 25 2013 11:52 PM | Updated on Sep 2 2017 1:57 AM

నిన్న నిజమై తరుముతుంటే నేడు గతమై నిలిచిపోతే నన్ను నేనై అడుగుతున్నా

 సాకీ :


 నిన్న నిజమై తరుముతుంటే
 నేడు గతమై నిలిచిపోతే
 నన్ను నేనై అడుగుతున్నా
   నిన్ను కూడా అడగనా!


 పల్లవి :


 హూ ఆర్ యూ... హూ ఆర్ యూ...
 జర దిల్ సే జారా ఫూఛో సాలా
   హూ ఆర్ యూ
 ॥ఆర్ యూ॥
 నువ్వంటే పేరుకాదు ఊరుకాదు
   ఫేస్‌కాదు
 నువ్వంటే క్యాష్ కాదు మరేంటి?
 నువ్వంటే టైమ్‌కాదు డ్రీమ్‌కాదు
   గేమ్‌కాదు
 నువ్వంటే నువ్వు కాదు మరేంటి?
 హూ ఆర్ యూ... ఊ...        (4)
 ॥ఆర్ యూ॥
 
 చరణం : 1
 
 నిన్ను నువ్వు వెతికే కొలంబస్ నువ్వా
 నీతో నువ్వు పాడే కోరస్ నువ్వా
 నిన్ను నువ్వు మోసే హెర్కులస్ నువ్వా
 నీతో నువ్వు ఆడే ఛెస్సే నువ్వా
 ఆటవా... పాటవా...
 వేటవా... వేటగాడివా...
 ॥ఆర్ యూ॥
 
 చరణం : 2
 
 నిప్పు పుట్టక ముందే
   నీలో గుండె మంట ఉందే
 నీరు పుట్టక ముందే నీలో కన్నీరుందే
 గాలి వీచక ముందే
   శ్వాసలోని తుఫానుందే
 నింగి నేల ఉనికి
   నీ ముందే ఓ ప్రశ్నయ్యిందే
 నిప్పువా... నీరువా...
 గాలివా... ప్రశ్నవా...
 ॥ఆర్ యూ॥
 
 చిత్రం : ‘1’ నేనొక్కడినే (2013)
 రచన : చంద్రబోస్
 సంగీతం, గానం : దేవిశ్రీ ప్రసాద్

 
 నిర్వహణ: నాగేశ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement