సీతాకోక రెక్కలు

New style Bell Bottom Pants  - Sakshi

బెల్‌ బాటమ్‌ ప్యాంట్స్‌ గురించి తెలిసిందే కదా! పాదాల వద్ద చాలా వదులుగా ‘బెల్‌’ ఆకారంలో ఈ ప్యాంట్స్‌ ఉంటాయి. ఇదే విధానం బెల్‌ ప్యాటర్న్‌ని స్లీవ్స్‌కి ఉపయోగించారు డిజైనర్లు. ముంజేతులు, మోచేతుల వద్ద ‘బెల్‌’ ఆకారం వస్తుంది. కుచ్చుల అమరిక అయితే భుజం నుంచి కూడా తీసుకోవచ్చు. వీటిని బటర్‌ఫ్లై స్లీవ్స్‌ అంటారు. ‘బిషప్‌ స్లీవ్స్‌’గా కూడా వీటికి మరో పేరుంది.

బ్యూటీ
విదేశాల్లో మొదలైన స్టైల్‌
మ్యాక్సీ డ్రెస్‌కు బెల్‌ స్లీవ్స్‌ వాడకం 1970లో మొదలయ్యింది. ఆ ప్యాటర్న్‌ ఈ పదేళ్లలో రకరకాల వెస్ట్రన్‌ డ్రెస్‌లకు హంగుగా మారింది. అయితే, ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం ఇటీవలే!

మనవాళ్లూ అందిపుచ్చుకున్నారు
దేశీయ సంప్రదాయ దస్తులను స్టైలిష్‌గా రూపకల్పన చేయడంలో ఫ్యాషన్‌ డిజైనర్లు ఎప్పటికప్పుడు ఉత్సుకత చూపుతూనే ఉన్నారు. దీంట్లో భాగంగానే చిన్న చిన్న గౌన్లతో పాటు బ్లౌజ్‌లకూ బెల్‌ షేప్‌ స్లీవ్స్‌ తీసుకువచ్చారు. దీంతో ఇవి కాస్త సంప్రదాయం, మరికాస్త పాశ్చాత్యంతో యువతరాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి. సంప్రదాయానికి అసలు సిసలు చిరునామాగా ఉండే చీరలకూ ఈ స్టైల్‌ని తీసుకువచ్చారు. శారీ బ్లౌజులకు కూడా బెల్‌ స్లీవ్స్, బటర్‌ఫ్లై స్లీవ్స్‌ జత చేయడంతో సరికొత్త స్టైల్‌తో అమ్మాయిలను, అమ్మలనూ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

పూర్తి కాంట్రాస్ట్‌తో మెరుపులు
చీరకు పూర్తి కాంట్రాస్ట్‌ కలర్‌ బ్లౌజ్‌ తీసుకుని లాంగ్‌ స్లీవ్స్‌ను బెల్‌షేప్‌లా డిజైన్‌ చేయాలి. దీని వల్ల మరో ఎంబ్రాయిడరీ వర్క్‌ అవసరం ఉండదు. లాంగ్‌ జాకెట్‌కు కుచ్చులు, లెహంగా, స్కర్ట్‌మీదకు లాంగ్‌ జాకెట్‌ని డిజైన్‌ చేసుకొని దీనికి బెల్‌ లేదా కుచ్చుల స్లీవ్స్‌ని జత చేస్తే చాలు ఇండో వెస్ట్రన్‌ లుక్‌తో పార్టీలో ఆకర్షణీయంగా కనిపిస్తారు.

పెప్లమ్‌ బ్లౌజ్‌
జాకెట్‌ నడుము భాగంలో కుచ్చుల పార్ట్‌ను అదనంగా జత చేస్తే పెప్లమ్‌ బ్లౌజ్‌ అవుతుంది. దీనికి బెల్‌ స్లీవ్స్‌ లేదా కుచ్చుల స్లీవ్స్‌ జత చేస్తే జాకెట్‌ లుక్‌ పూర్తిగా మారిపోతుంది. ఈ మోడ్రన్‌ జాకెట్‌ను అటు లాంగ్‌ లెహంగాల మీదకే కాకుండా జీన్స్‌ వంటి అధునాతన ప్యాంట్స్‌మీదకూ ధరించవచ్చు. జాకెట్‌ చేతుల భాగం వదులుగా ఉండటం వల్ల వేసవి ఉక్కకు సరైన పరిష్కారం కూడా దొరికినట్టే. స్టైల్‌కి స్టైల్‌ .. సౌకర్యానికి సౌకర్యం.

ఒకే నగ కాలికి.. భుజానికి
అందమైన ఆభరణాలతో మేనిని సింగారించడం అనే మాట మగువలకు అత్యంత ప్రియమైనది. ఆధునిక మహిళల మదిని దోచుకునేలా బాడీ జువెల్రీ పేరుతో కాలికి, భుజానికి పట్టీలా అలంకరించుకునేందుకు ఓ ఆభరణం సిద్ధంగా ఉంది. అదే యాంకిల్‌ అండ్‌ ఆర్మ్‌ జువెల్రీ. ఫ్యాషన్‌ జువెల్రీగా అతివలను ఆకట్టుకుంటున్న ఈ నవీన ఆభరణాలను ధరించే డ్రెస్‌ను బట్టి ఒకసారి చేతికి పట్టీలా అలంకరించుకొని మెరిసిపోవచ్చు. మరోసారి కాలికి పట్టీలా ధరించి వెలిగిపోవచ్చు. ధర మాత్రం ఆన్‌లైన్‌లో రూ.200/– నుంచి పలుకుతున్నాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top