పొడవైన స్టైల్‌

New  look fashion to  Embroidery Blouse - Sakshi

న్యూ  లుక్‌

పట్టు చీర మీదకు గ్రాండ్‌గా మగ్గం వర్క్‌ చేసిన ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌ ధరించడం మామూలే! కొంచెం స్టైల్‌ మార్చాలి అనుకుంటే పూర్తి కాంట్రాస్ట్‌ కలర్‌ ఒక ఆప్షన్‌. అయితే ఇప్పుడు లాంగ్‌ స్లీవ్స్‌ అదేనండి పొడవాటి చేతులున్న బ్లౌజ్‌ని ధరించడం అసలు సిసలు ఎంపిక అయ్యింది. బెనారస్, ఉప్పాడ, కంచిపట్టు, డిజైనర్‌ శారీ ఏదైనా ఎంచుకోండి. దాని మీదకు పొడవాటి చేతులున్న బ్లౌజ్‌ని ధరించండి. కాంట్రాస్ట్‌ కలర్‌ అయితే మరీ బెస్ట్‌. దీనికి ఎంబ్రాయిడరీ హంగులు అవసరం లేదు.
 

ఆభరణాల అలంకరణా ముఖ్యం కాదు. నలుగురిలో ప్రత్యేకంగా, నవ్యంగా కనిపించాలంటే ఎంపిక చేసుకున్న బెస్ట్‌ స్టైల్‌  లాంగ్‌ స్లీవ్స్‌. ఇది ఒకప్పుడు ఉన్న స్టైలే. దీనికే కొద్దిగా ఎంబ్రాయిడరీ, ఇంకొద్దిగా ఆభరణాలు.. అంటూ  కొన్ని మెరుగులు దిద్దవచ్చు. మరీ ఎక్కువ హంగూ, ఆర్బాటాలకు పోకుండా సింపుల్‌గా  లేకుండా పట్టు చీర మీదకు ఇలా పొడవైన స్టైల్‌ని క్రియేట్‌ చేయండి. బెస్ట్‌ మార్క్స్‌ కొట్టేయండి. 
– కీర్తికా గుప్తా, డిజైనర్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top