ఇట్టే కలిసిపోయారు!!

Meghan Markle and Kate Middleton Matched Again - Sakshi

బుధవారం ఎవరి పనిమీద వాళ్లు బైటికొచ్చారు మేఘన్‌ మార్కెల్, కేట్‌ మిడిల్టన్‌. మేఘన్‌.. ప్రిన్స్‌ హ్యారీ భార్య. కేట్‌.. ప్రిన్స్‌ విలియమ్స్‌ భార్య.  ఇద్దరూ తోడికోడళ్లు. అయితే ఒకరికొకరు తోడుగా ఏమీ వాళ్లు బయటికి రాలేదు. ఎవరికి వారుగా వెళ్లిపోయారు. మేఘన్‌ వెళ్లింది ఒక వంటల ప్రోగ్రామ్‌కి చీఫ్‌ గెస్ట్‌గా. కేట్‌ Ðð ళ్లింది.. లండన్‌ యూనివర్సిటీ కాలేజ్‌లోని న్యూరోసైన్స్‌ యూనిట్‌కి. లండన్‌లో ‘హబ్‌’ అనే ముస్లిం కమ్యూనిటీ ఉంది. వాళ్లు చేసే వంటలకు పబ్లిసిటీ ఇచ్చేందుకు వెళ్లారు మేఘన్‌. న్యూరోసైన్స్‌ యూనిట్‌లో.. పిల్లల బ్రెయిన్‌ వికసించే పరిణామక్రమంలో లెక్చర్‌ వినేందుకు వెళ్లారు కేట్‌. ఇక్కడి వరకు విశేషం ఏమీ లేదు. అనుకోకుండా ఇద్దరూ ఒకే డ్రెస్‌లో లండన్‌ వీధుల్లోకి వచ్చారు. అదీ విశేషం.

మేఘన్‌ మెరూన్‌ డ్రెస్‌తో వచ్చారు. సేమ్‌ అలాంటిదే వేస్కుని, బ్లాక్‌ కాంబినేషన్‌తో కేట్‌ ప్రత్యక్షం అయ్యారు. డ్రెస్‌ మాత్రమే ‘సేమ్‌ పించ్‌’ కాదు. ‘లో పోనీ టైల్‌’ కూడా సేమ్‌. ప్లాన్‌ చేసుకునే వచ్చారా ఏంటి? పెద్ద నవ్వు. ఇద్దరిదీ! దానర్థం ‘నో ప్లానింగ్‌’ అని. కేట్‌ డ్రెస్‌ ‘పాల్కా’ బ్రాండ్‌. ప్యారిస్‌ నుంచి ఇంపోర్ట్‌ అయింది. 2012 నుంచి సేమ్‌ డ్రెస్‌ను రిపీట్‌ చేస్తున్నారు కేట్‌. మేఘన్‌ వేసుకున్న బ్రాండ్‌ ‘క్లబ్‌ మొనాకో’. యు.ఎస్‌. కంపెనీ. కొంచెం ఖరీదైంది. చిరునవ్వు ఇద్దరు అపరిచితులను కలుపుతుంది. సేమ్‌ పించ్‌ రెండు చిరునవ్వులను వెలిగిస్తుంది. ఒకే విధమైన డ్రెస్‌ వేసుకొచ్చిన ఇద్దరు నార్మల్‌ పర్సన్స్‌ ఆ పూటకి సెలబ్రిటీలు! ఒకే డ్రెస్‌లో కనిపించిన ఇద్దరు సెలబ్రిటీలు.. ఆ పూటకు సామాన్యులు. ఆ సామాన్యతే ఈ ఇద్దరు కోడళ్లకు ఎప్పటికప్పుడు సెలబ్రిటీ స్టేటస్‌ ఇస్తోంది.


సేమ్‌ పించ్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top