మెడి క్షనరీ | Sakshi
Sakshi News home page

మెడి క్షనరీ

Published Mon, Sep 7 2015 11:23 PM

మెడి క్షనరీ

స్కాల్ప్ (ఇఅఔ్క) అంటే ?
 
మనం మాడు భాగాన్ని ఇంగ్లిష్‌లో స్కాల్ప్ అని వ్యవహరిస్తుంటాం. ముక్కు, చెవి, నుదురులాగే అది కూడా ఆ భాగం పేరుగా చాలామంది అనుకుంటుంటారు. నిజానికి స్కాల్ప్ అనేది ఒక పదం కాదు. ఇంగ్లిష్‌లో ఐదుపదాల ముందు అక్షరాలను తీసుకొని ‘స్కాల్ప్’ అనే పదాన్ని రూపొందించారు. దీని స్పెల్లింగ్‌లోని ఐదు ఇంగ్లిష్ అక్షరాలూ ఇలా ఉంటాయి.

ఎస్ అంటే స్కిన్ అనీ, సీ అంటే కనెక్టివ్ టిష్యూ అనీ, ఏ అంటే ఎపోన్యూరోటికా అనీ, ఎల్ అంటే లూజ్ ఏరియోలా అనీ, పీ అంటే పెరియాస్టియమ్ అనే మాటలను సూచిస్తాయి. ఇందులో మొదటిదైన స్కిన్ అంటే చర్మం నుంచి మొదలై  నుంచి పి అంటే పెరియాస్టియమ్ అనే పుర్రె ఎముక భాగం వరకు వరసగా ఉంటే పొరలకు ఉన్న పేర్లతో స్కాల్ అనే మాట ఉద్భవించింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement