నన్నడగొద్దు ప్లీజ్‌ | love problems and solutions | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

May 29 2017 11:40 PM | Updated on Sep 5 2017 12:17 PM

నన్నడగొద్దు ప్లీజ్‌

నన్నడగొద్దు ప్లీజ్‌

హాయ్‌ సర్‌! నేను ఇంటర్‌లో ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలకు నా రూమ్‌లోనే పడింది.

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సర్‌! నేను ఇంటర్‌లో ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలకు నా రూమ్‌లోనే పడింది. లాస్ట్‌లో నా లవ్‌ ప్రపోజ్‌ చేద్దాం అనుకున్నా కానీ, ధైర్యం సరిపోలేదు. ఎగ్జామ్స్‌ కూడా అయిపోయాయి. త్రీ మంత్స్‌గా ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. నేను నల్లగా, లావుగా, మొటిమలతో ఉంటాను. అందుకే తను నా ప్రేమను ఒప్పుకుంటుందో లేదో అని భయంగా ఉంది సార్‌! ఏదైనా సలహా ఇవ్వండి. – కిరణ్‌
మై డియర్‌ కిరణ్‌ రూపం మనది కాదు. దేవుడిచ్చింది! ప్రేమ మనది. ఎవరికైనా ఇచ్చుకోవచ్చు! ‘కొడుతుంది సార్‌!?’ వై నీలాంబరి?
‘అద్దంలో ముఖం చూసుకున్నావా మాడిన పనసపండు! అని ఛీ కొడుతుందేమో సార్‌!’ పనస తొనలు తిన్న వాళ్లు ఎవరూ పనసపండు అవుట్‌ సైడ్‌ చూసి డెసిషన్‌ తీసుకోరు! ‘పాపం! పసివాడు తన్నులు తింటాడేమో సార్‌?’ జబ్‌ ప్యార్‌ కియాతో డర్నా క్యా...! ‘ప్రపోజ్‌ చేసినప్పుడు రెండు అరటిపండ్లు కూడా ఇవ్వమనండి సార్, అమ్మవారు చల్లారి యాక్షన్‌ తగ్గుతుంది. బీ కేర్‌ఫుల్‌ కిరణ్‌!’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.  లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement
 
Advertisement
Advertisement