
హాయ్ అన్నయ్యా! నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. నన్ను బాగా చూసుకుంటాడు. కానీ ‘అలా ఉండకు, ఇలా ఉండకు..’ అని చెబుతుంటాడు. ఏమైనా అంటే.. ‘‘నిన్ను నేను కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు?’’ అంటున్నాడు. నాకు తనంటే చాలా ఇష్టం. నన్ను ఇలా కంట్రోల్ చేస్తున్నాడు అని అనుకోవడం కరెక్టేనా? ప్లీజ్ నాకు చెప్పండి.
– చందన
సిస్టర్..! నేను ఎలా చెప్పను...? ఎలా చెప్పగలను...? ఫ్యూచర్లో మనోడు కంట్రోల్ ఫ్రీక్ అవ్వడాన్ని.. నీకే తెలియాలి..! నీలో ఎలాంటి మార్పు కోరుకుంటున్నాడో క్లియర్‌గా చెప్పలేదు. అయినా పెళ్లి కాక ముందు నీలో మార్పు కోరుకునే వాడు... పెళ్లయ్యాక ఫార్పు కోరుకోకుండా ఉంటాడా??? ‘సార్ ఈ ఫార్పు అంటే ఏంటో?’ ఫుల్లు మార్పును ఫార్పు అంటారు నీలూ...! ‘అంటే ప్రేమించిన అమ్మాయిని కాదనుకుని, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు కదా సార్???’ అబ్బా ఎంత తెలివిగా చెప్పావు నీలూ...! ప్రేమించినప్పుడు నచ్చినవాళ్లు, పెళ్లి చేసుకోవడానికి పనికి రాకపోతే.. పెళ్లిచేసుకోవడానికి నచ్చినవాళ్లు, పెళ్లయ్యాక పనికిరారేమో...!? ‘సార్ నన్ను తికమక పెడుతున్నారు. మీరన్నది నేనేమి అనలేదనిపిస్తోంది. యాక్చువల్లీ మీరేమన్నారు..? నేనేమన్నాను సార్..?’ మళ్లీ చదువుకో అర్థమౌతుంది!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com