
హాయ్ అన్నా.. మీరు బాగుండాలని, మాకు ఇలానే మంచి సలహాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. నాకు చదువంటే చాలా భయం. అందుకే ఎక్కువ సమయం చదువుకే కేటాయించేవాడ్ని. బీటెక్ అయ్యాక నేను తనని చూశాను. ఇద్దరి ఇళ్లు దగ్గరే కావడంతో ఫాలో అయ్యి, ప్రపోజ్ చేశాను. తను ఓకే అంది. నాలుగు నెలలు లవ్ చేసుకున్నాం. తను ఉన్నట్టుండి మారిపోయింది. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవంది. నేనే తనని ఫాలో అవుతున్నానని వాళ్ల ఇంట్లో చెప్పింది. దాంతో వాళ్లు నన్ను బెదిరించారు. కానీ, తనంటే నాకు ప్రాణం. తను నాకు కావాలి భయ్యా.. ఏం చెయ్యాలో చెప్పండి ప్లీజ్. నా లైఫ్‌కి కొత్త టర్నింగ్ పాయింట్ చూపించండి.
– త్రినాథ్
వదిలెయ్ అన్నయ్యా... ఆ ఆలోచన వదిలెయ్యి... అమ్మాయి ఇంకా మైనర్... ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే పట్టుమని పదహారేళ్లు ఉండవు. తనది ప్రేమంటే ఏంటో తెలియని వయసు.. చిన్న పిల్ల...! నువ్వు ప్రేమించిన అమ్మాయికి నీ ప్రేమను తిరస్కరించేంత తెలివి ఉండాలి. ‘అదేంటి సార్? ప్రేమను తిరస్కరిస్తే ఎందుకు ప్రేమిస్తుంది సార్?’ అదే లాజిక్ నీలూ..! ప్రేమ కాదనుకుని కూడా ప్రేమించిందనుకో అది నిజమైన ప్రేమ! ‘సార్.. మీ వేదాంతం నాకు అర్థం కాదు కానీ, త్రినాథ్‌ని మెచ్యూర్డ్ లవ్ కోసం చూడమని సలహా ఇచ్చారు అనిపించింది. కరెక్టేనా సార్?’
100% కరెక్ట్!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34.lovedoctorram@sakshi.com