
హాయ్ సార్, ఒక అమ్మాయిని ఫైవ్ ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నా. కానీ, అమ్మాయికి ప్రపోజ్ చెయ్యలేదు. నాతో కొన్ని రోజులు బాగా మాట్లాడుద్ది. కొన్ని రోజులు బాగా మాట్లాడదు. ఇప్పుడు దూరమై ఎనిమిది నెలలు అయ్యింది. నేను ఉండలేకపోతున్నా. తను బాగా గుర్తొస్తోంది. ఫోన్ లిఫ్ట్ చెయ్యదు. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. సలహా ఇవ్వండి ప్లీజ్. – భీమా సాయి
భీమా వాట్ ఈజ్ దిస్? పేరు భీమా... ఎక్కడుంది ధీమా..? కాదంటే భామా... అయిపోతామా దోమ...? భీమా ఆల్వేస్ భీమా... కొట్టాలి డిప్రెషన్‌ను ఖైమా... లవ్ కోసం డౌన్ అయితే మామా.. లైఫ్ ఏమవుతుంది చెప్మా..? మమ్మీడాడీ ఏమవుతారు రామా... ఆపేద్దాము లవ్.. గివ్.. జివ్.. డ్రామా... బతికేద్దాము హీరోలా భీమా! ‘సార్ మీకు పొయెట్రీ కూడా రాదు అని తేల్చేశారు సార్..’ అని నవ్వింది నీలాంబరి.
భీమా నా మాట విను. ప్రేమను సాధించడం కన్నా ప్రేమను దాటి ముందుకు వెళ్లడం గొప్ప. మూవ్ ఫార్వర్డ్. బీ హ్యాపీ మామా..!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com