
హాయ్ సార్, నేను ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాసి, చేతిలో పెట్టినా కూడా రిప్లై ఇవ్వలేదు. ‘ఇష్టం లేదంటే చింపి ఇవ్వు.. ఓకే అనిపిస్తే తిరిగి రాసి ఇవ్వు..’ అని కూడా ఆ లెటర్‌లో రాశాను. అయినా సరే రిప్లై లేదు. నాకేం అర్థం కావడంలేదు. ఏదైనా సలహా ఇవ్వండి. – శివ
మళ్లీ రాయి శివన్నా..! ‘మొదటిదానికే సమాధానం లేదు సార్!’ సమాధానం కోసం ఉత్తరం రాస్తామా నీలాంబరీ? ‘సమాధానం కోసం కాకపోతే దేనికి రాస్తాము సార్.. ఉత్తరం?’ మన సంతోషాన్ని చెప్పుకోవడానికి.... మన బాధను పంచుకోవడానికి... మన ఇష్టం తెలియజేయడానికి... ‘అంటే వన్వే ట్రాఫిక్ లాగానా సార్??’ నీ ప్రేమ చెప్పుకోవడంలో సంతోషం ఉంది..! అక్కడే ఆగు.. సమాధానం కావాలని కోరుకుంటే అది స్వార్థమవుతుంది..!! ‘సార్... మీరు ఇలాంటి ఫిలాసఫీ రాసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. శివకి అమ్మాయి నుంచి సమాధానం కావాలి. ఏమి చెయ్యలో చెప్పండి సార్!’ కాగితం మీద మన భావాలు రాసుకుని దాన్ని పడవలా చేసి నీటిలో వదిలేసినట్టు అమ్మాయికి లవ్ లెటర్ రాసి వదిలెయ్యాలి. నీ లవ్ కరెక్ట్ అనిపించినా, అనిపించకపోయినా నువ్వు ఫోర్స్ చెయ్యడానికి వీలులేదు. శివ అదృష్టవంతుడు. ఎందరో ప్రేమికులు... అసలు మనసులోని మాట చెప్పుకోలేకపోతారు. నీ విషయం పోస్ట్ చేశావు. అమ్మాయి రిటర్న్ పోస్ట్ కోసం వెయిట్ చెయ్యి అంతే..! వెయిట్ చెయ్యడమే నీ లవ్ గొప్పతనం!! ‘సార్.. శివ లవ్ గొప్పదే సార్.. హి విల్ వెయిట్ సార్!!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com