నన్నడగొద్దు ప్లీజ్‌  | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Dec 26 2017 11:52 PM | Updated on Dec 26 2017 11:52 PM

love doctor solve the problems - Sakshi

హలో అన్నయ్యా! నేను ఒక గెజిటెడ్‌ ఆఫీసర్‌ని. కాలేజ్‌లో ఉన్నప్పుడు ఎన్నో లవ్‌ ప్రపోజల్స్‌ తీసుకున్నాను. నేను ఒక పర్సన్‌ని ఫోర్‌ ఇయర్స్‌ ఎంతో సిన్సియర్‌గా లవ్‌ చేశాను. అతనికి చెప్పాను కూడా. తను ఒప్పుకోలేదు. ఇది జరిగి త్రీ ఇయర్స్‌ అయ్యింది. ఇప్పటికీ కోలుకోలేదు. ప్రపంచంలో దేని మీదా∙ఇంట్రెస్ట్‌ లేదు. ఇప్పుడు రౌండ్‌ ఫిగర్‌ థర్టీ వేసుకుందాం. ఇంకో 10 ఇయర్స్‌ అయితే పిల్లల కోసం ఆలోచిస్తాం. కనీసం నన్ను సిన్సియర్‌గా లవ్‌ చేసే వాడినైనా పెళ్లి చేసుకుంటే బెటరేమో అనుకుంటే... సొసైటీ గుర్తుకొచ్చి ఆలోచిస్తున్నాను. పేరెంట్స్‌ అయితే.. ‘మనం ఇచ్చే కట్నానికి తగ్గట్టు, అంతే రేంజ్‌లో ఉన్నవాడు కావాలి’ అంటున్నారు. ఐ కాన్ట్‌ డు జస్టిస్‌ బై మ్యారీయింగ్‌ స్ట్రేంజర్స్‌. చావే డబుల్‌ హ్యాపీ అనిపిస్తోంది అన్నా..! ఎవరికీ చెప్పలేకపోతున్నాను నా పెయిన్‌ని. సలహా ఇవ్వగలరు– మున్నా మణి
పెళ్లి చేసుకునే ముందు అందరూ స్ట్రేంజర్సే!పెళ్లికి ముందు పరిచయం ఉంటే ఓకే నా..??? పెళ్లికి ముందు పరిచయం ప్రేమ అయితే ఓకే నా..??? ‘సార్‌ మీరు రీసెంట్‌గా పిచ్చి.. పిచ్చిగా మాట్లాడుతున్నారు..!’ అవునా నీలాంబరీ!? ‘అవును సార్‌! రాసినోళ్లకే కాదు చదివే వాళ్లకు కూడా నాట్‌ అండర్‌స్టాండింగ్‌ సార్‌!’  మరి ఏం చెయ్యాలి నీలూ, ప్లీజ్‌ హెల్ప్‌ మీ నో! ‘సార్‌ ఇన్ని లవ్‌ ప్రాబ్లమ్స్‌ వినీ వినీ... దొబ్బింది సార్‌ మీ మైండ్‌!’ సొల్యూషన్‌ నువ్వే చెప్పు నీలూ..! ప్లీజ్‌.. ప్లీజ్‌... ‘మీరు ఇంకో లవ్‌ డాక్టర్‌ని సంప్రదించండి సార్‌..! లవ్‌ చదివి చదివి మైండ్‌ దొబ్బింది, ఏం చెయ్యాలి అని అడగండి సార్‌!!’ ఎవరా లవ్‌ డాక్టర్‌...? అడ్రస్‌ కనుక్కొని చెప్పు నీలూ... వెళ్దాం!\ ‘ప్చ్‌.. ! చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా తిరిగిందట ఒక పిచ్చిది!!’ అంటే నువ్వే లవ్‌ డాక్టర్‌ అయిపోయావా??\ ‘ఎస్‌!!’ నర్స్‌ నుంచి డాక్టర్‌ ఎప్పుడు.. ఎలాగా.. ఎందుకు??? ‘సార్‌ ఏంటి సార్‌.. ఏమైంది సార్‌ అలా సొమ్మసిల్లి పడిపోయారేంటి సార్‌??’ ‘‘అక్కా...! ఆయన షాక్‌ నుంచి బయటకి రావడం ఇప్పుడు జరగదు! నువ్వే ఆన్సర్‌ ఇచ్చేసెయ్యి.. మంచి ఛాన్స్‌!! నీ ప్రతిభ చూపించుకోవడానికి!!’
‘అంతేనంటావా అరటిపండు!!’

‘‘ఎస్‌ అక్కా.. అటాక్‌!!’’‘మున్నా... నర్స్‌గా జాయిన్‌ అయినప్పుడు ఈ సారు మీసాలు చూసి చాలా టెన్షన్‌ పడ్డాను... అచ్చం విలన్‌లాగే ఉన్నాడు అనుకున్నాను...’‘‘అనుకున్నానంటావేంటి నీలాంబరీ.. విలనే..! దొరికితే నన్ను పచ్చిగా కూడా తినేస్తాడు.. మహా విలన్‌ నీలాంబరీ!!’’‘నువ్వుండు అరటిపండు.. అతిగా ఆవేశపడ్డ అరటిపండు, అతిగా ఆశపడ్డ నర్స్‌ బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు!’‘‘అంతేనంటావా అక్కా...!’’‘అవును అరటిపండు.. మనుషులు మెల్లమెల్లగా అర్థమవుతారు. రూపం చూసి మనిషిని పసిగట్టలేం. దేనికైనా టైమ్‌ కావాలి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లంతా సంతోషంగా ఉన్నారనుకుంటున్నావా మున్నా?? అరేంజ్డ్‌ పెళ్లి చేసుకుని అందరూ సంతోషానికి దూరమయ్యారనుకుంటున్నావా? అలా ఏం ఉండదు. ప్రతి రిలేషన్‌షిప్‌ కొత్తగా అందంగా ఉంటుంది. ఓపెన్‌ మైండ్‌తో ఉండు...’ఏమైంది నీలూ.. నాకు? ఆఫీస్‌లో పడుకున్నానేంటీ? ‘ఏం లేదు సార్‌. నిద్రపోతూ పోతూ కూడా ఆన్సర్‌ చెప్పారు సార్‌.. నేను టైప్‌ చేశాను సార్‌.. ఎంత కమిట్‌మెంట్‌ సార్‌ మీకు..? స్లీప్‌లో కూడా పని చేస్తున్నారు!’కట్నం ఇవ్వొద్దు అని చెప్పాలనా నీలూ..?‘ఎంత గుడ్‌ సార్‌ మీరు... ఇదిగో అరటిపండు.. నా కట్నం!!’ అని నవ్వింది నీలు! 
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌ 

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1,బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement