నన్నడగొద్దు ప్లీజ్‌

love doctor solve the problems - Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సర్, నేను ఒక అమ్మాయిని వన్‌ అండ్‌ ఆఫ్‌ ఇయర్స్‌ నుంచి లవ్‌ చేస్తున్నాను. తనూ నేను ఒకే ఆఫీస్‌లో పని చేస్తున్నాం. నాకు అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడటం చేతకాదు. కానీ తనతో ఎప్పుడూ మాట్లాడాలనిపిస్తోంది. తను లేకపోతే జీవితమే లేదనిపిస్తోంది. తనకు ప్రపోజ్‌ చెయ్యాలంటే ఎందుకో తెలియని కంగారు, భయం. నా లవ్‌కి చిన్న సొల్యూషన్‌ ఇవ్వండి సార్‌ ప్లీజ్‌! – అభి
ఎయిటీన్‌ మంత్స్‌ గుండె గర్భంలో పెంచుతున్నావా అన్నా.. నీ ప్రేమను!??‘అబ్బా.. ఏం ప్రయోగం సార్‌ అది.. ‘‘గుండె గర్భంలో..!’’ వెరీ ఫన్నీ..!! నాట్‌ ఎటాల్‌ సీరియస్‌ సార్‌!!’తల్లి గర్భంలో పెరిగేది బాధ్యత అయితే....‘అయితే...!?!’గుండె గర్భంలో పెరిగేది ప్రేమ!!‘అంటే.. గుండెలో పెరిగే ప్రేమకు బాధ్యత ఉండదని తిడుతున్నారు కదా సార్‌?’తిట్టానా నీలాంబరీ..?‘సార్‌ అసలు అబ్బాయిలు అడ్వయిజ్‌ కావాలని మీకు రాయడముంది చూసారూ... వాళ్ల గుండెల్ని వాళ్ల రాళ్లతోనే కొట్టుకున్నట్టు సార్‌!’ఏంటి నీలూ నీ ఫ్లోలో నువ్వు రెచ్చిపోతున్నావు.. ఇప్పుడు నేనేమన్నానని?‘ఇంకేమనాలి సార్‌? అభిది బాధ్యత లేని వల్లమాలిన ప్రేమ అనే కదా సార్‌ మీరు చెప్పాలనుకుంది? అలాంటి వల్లమాలిన ప్రేమ చెప్పుకునే బదులు ఎయిటీన్‌ మంత్స్‌ ఏం కర్మా.. ఎయిటీన్‌ ఇయర్స్‌ అయినా మౌనంగా గుండె గర్భంలో పెట్టుకో.. అనే కదా సార్‌ మీరు చెప్పబోయేది..!?’

రామరామా... నేనెపుడన్నాను అట్లా?‘సరే సార్‌ చెప్పండి ఏం చెబుతారో చూస్తానుగా!’కంగారు ఎందుకు అభి..? భయం ఎందుకు అబ్బీ..? 143 చెప్పడానికి జంకు ఎందుకు అబ్బబ్బి...?? లవ్‌ గుండెలో ఉంటే లబ్‌..డబ్‌.. అవుతుంది! మూతవేసిన డబ్బి.. ఓపెన్‌ చెయ్యి..! ఓపెన్గా చెప్పెయ్యి.. తగిలితే రెండు చెంపదెబ్బలు.. కలిగితే లవ్‌ చప్పుళ్లు... డెసీషన్‌ నీది... భయపడకు! కంగారు వద్దు!! హెల్మెట్‌ వేసుకుని వెళ్లి చెప్పెయ్యి...!‘సార్‌.. మీ అసలు కలర్‌ బయటపడింది సార్‌! హెల్మెట్‌ వేసుకుంటే చెంపదెబ్బ పడదు కానీ, అబ్బాయి ఎవరో తెలియదు కదా సార్‌??? అభి ప్రేమకు మీరు హెల్మెట్‌ అడ్డం పెట్టారు సార్‌!’
వెకిలి పనులు చెయ్యకుండా జెంటిల్‌మన్‌లాగా ప్రపోజ్‌ చేస్తే హెల్మెట్‌ అక్కర్లేదు..! ప్రేమను బాధ్యతగా గుర్తిస్తే చాలు!! గుండె గర్భం ప్రేమను తప్పకుండా డెలివర్‌ చేస్తుంది. ఇంకా మంచి ఐడియా ప్రపోజల్‌ ఇచ్చేముందు...‘అరటిపండు ఇవ్వాలి కదా సార్‌!’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్నిగందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ,  సాక్షి టవర్స్, రోడ్‌ నంబర్‌ 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top