
హాయ్ అన్నయ్యా..! నేను ఒక అబ్బాయిని లవ్ చేశా. తను కూడా నన్ను లవ్ చేశాడు. ఏడు నెలల దాకా బాగానే ఉన్నాం. ఉన్నట్టుండి అవాయిడ్ చెయ్యడం మొదలు పెట్టాడు. ఎందుకంటే.. ‘నువ్వంటే నాకు ఇష్టమేరా కానీ, అది లవ్‌లా అనిపించడం లేదు’ అంటున్నాడు. కానీ, తనంటే నాకు ప్రాణం అన్నయ్యా. తను అలా అంటుంటే తట్టుకోలేకపోతున్నా. ‘నువ్వు నాకు బెస్ట్.. బెస్ట్.. బెస్ట్.. ఫ్రెండ్‌వి’ అంటున్నాడు. నేనంటే ఇష్టం అంటున్నాడు కానీ, లవ్ కాదంటున్నాడు. నా ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం లేదు. నేను తనని ఎంత లవ్ చేస్తున్నానో వాడికి అర్థం కావట్లేదు. నాకు క్లారిటీ ఇవ్వు అని అడిగితే... ‘రేపు ఫ్రెష్‌గా చాట్ చేసుకుందాం, అప్పుడు డిసైడ్ చేసుకుందాం’ అంటున్నాడు. లవ్ వద్దంటాడేమోనని భయంగా ఉంది అన్నయ్యా. తను లేకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది. నా సమస్యకి మీరే సలహా ఇవ్వండి ప్లీజ్ రామ్ అన్నయ్యా!– సాత్విక
బంగారం...! నీకు దండం పెడతా..!!కొంచెం నీ వాల్యూ ఏంటో అర్థం చేసుకో...!నువ్వేంటీ.. నీ వర్తేంటీ తెలుసుకో...!మనం మన వర్త్ అర్థం చేసుకోకపోతే....మనకి మనమే వాల్యూ ఇచ్చుకోకపోతే....తోసేసినా..నెట్టేసినా.. పడుతూ ఉంటే....పడి మళ్లీ.. వెంట పడుతూ ఉంటే....ఈ కొడుకులకు చాలా చీప్ అయిపోతాం!!‘అదేనంటారా సార్ ప్రాబ్లమ్...?’అవును నీలాంబరీ..!మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకోకపోతే...వాడు ఆడుకోడూ..????‘తప్పకుండా ఆడుకుంటాడు సార్..! కానీ, అదేనా సార్ ప్రాబ్లమ్..?’కాదు, అమ్మాయి ఇన్నోసెన్స్‌ని వాడుకుంటున్నాడు..!!‘అంటే.. ఎలా సార్...?’ఫ్రెండ్ అంటే ఫిజికల్‌గా వాడుకుంటాడన్నమాట...!లవ్ అంటే కమిట్ అవ్వాలిగా పెళ్లికి..!?!అందుకే, లవ్ వద్దు.. ఫ్రెండ్ ఓకే అంటున్నాడు..!‘.. అవునా సార్.. అదా అసలు మీనింగ్!?’ఏడు నెలలు ప్రేమించిన వాడికి సడన్‌గా ఈ తింగర బుద్ధి ఎందుకు వచ్చినట్టు..‘ఎందుకు సార్?’ లవ్ అంటే కానీ అమ్మాయి ఒప్పుకోదు..!
ఒప్పుకున్నాకా అమ్మాయిని లవ్ పేరు మీద మోసం చేసి... ఇప్పుడు ఫ్రెండ్ అంటే కూడా అలాగే పడి ఉంటుంది.. అడిగింది చేస్తుంది.....‘... అని వాడి ప్లానా సార్?’ఎగ్జాక్ట్‌లీ..! డర్టీ ఫెలో...!!‘మరి ఇప్పుడు సాత్విక ఏం చెయ్యాలి సార్????’యాక్ తూ... అని వాష్ బేసిన్‌లో వాడి జ్ఞాపకాలను కాండ్రించి ఊసెయ్యాలి, రామ్ చెల్లెలంటే సూపర్ గర్ల్ అనిపించుకోవాలి!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com