నన్నడగొద్దు ప్లీజ్‌

love doctor solve the problems - Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నయ్యా..! రెండేళ్లుగా ఒక అబ్బాయిని లవ్‌ చేస్తున్నా. తనకి నేనంటే ప్రాణం. ముందు నుంచి కూడా ఇంట్లో వాళ్లని ఒప్పించే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నా. ‘‘నిన్ను కష్టపెట్టను, లాస్ట్‌ డెసిషన్‌ నీదే, నువ్వు ఎలా చెప్తే అలానే చేద్దాం, మనం కలిసి ఉండాలని ఎక్కువ హోప్స్‌ పెట్టుకోకు, ఏదైనా తేడా జరిగితే నువ్వు తట్టుకోలేవ్‌!’’ అంటూ చాలా చెప్పేవాడు. వాళ్లది కొంచెం పూర్‌ ఫ్యామిలీ. ఏ విషయమూ నా దగ్గర దాయడు. లాస్ట్‌ టైమ్‌ పోలీస్‌ జాబ్‌కి ట్రై చేశాడు. కానీ మిస్‌ అయ్యింది. అప్పటి నుంచి కొంచెం అప్‌సెట్‌లో ఉంటున్నాడు. ‘‘మీ ఇంట్లో చూసిన సంబంధమే చేసుకో, మంచి సంబంధమే చూస్తారు. నా దగ్గరికి వస్తే నీకు దరిద్రం తప్ప ఇంకేం ఇవ్వలేను’’ అన్నాడు. చాలా చెప్పాను. నేనే జాబ్‌ చేస్తా.. కలిసి హోమ్‌ మ్యానేజ్‌ చేయొచ్చు అని చెప్పాను. ఫస్ట్‌ సరే అన్నాడు. దాంతో చాలా కష్టపడి గవర్నమెంట్‌ జాబ్‌ సంపాదించాను. అయినా సరే ఇప్పుడు వద్దంటున్నాడు. ‘‘నీ సంపాదనతో నా ఫ్యామిలీని పోషించాలా? నాకు నచ్చదు, వద్దు’’ అంటున్నాడు. ఉన్న ప్రైవేట్‌ జాబ్‌ మానేసి ఇంట్లోనే జాబ్‌ కోసం ప్రిపేర్‌ అవుతున్నాడు.

ఎలాగో జాబ్‌ కోసం ట్రై చేస్తున్నాడు కదా వచ్చాక పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే.. కానీ అలా కూడా వద్దు అంటున్నాడు. ఏం చెయ్యాలి అన్నయ్యా.. తన సెల్ఫ్‌ రెస్పెక్ట్‌కి గౌరవం ఇవ్వాలా? ఇలా చేస్తున్నందుకు కోప్పడాలా అర్థం కావడం లేదు. మాది ముస్లిం ఫ్యామిలీ. మా డాడ్‌ చాలా మంచివారు. అందరూ ‘ఆడపిల్లకి చదువు ఎందుకు’ అన్నా వినకుండా నన్ను చదివించారు. నేను తన మాటకు ఎదురు చెప్పను కానీ ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నా. కానీ అలా జరిగితే మీ డాడ్‌ సమాజంలో తలెత్తుకోగలరా? అంటూ మా డాడ్‌ కోసం ఆలోచించి నన్ను వద్దు అంటున్నాడు. వాళ్ల సిస్టర్‌కి అలానే ఇంటర్‌ క్యాస్ట్‌ మ్యారేజ్‌ జరిగిందట. అప్పుడు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకోవడం తను విన్నాడట. అప్పటి నుంచి ఇలానే అంటున్నాడు. తన గురించి ఇంట్లో చెబుదాం అంటే వద్దంటారనే భయం ఓవైపు... ఒకవేళ వాళ్లంతా ఒప్పుకున్నాకా, ఇతను వద్దంటాడేమోనని భయం మరోవైపు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అన్నయ్యా. ప్లీజ్‌ మంచి సలహా ఇవ్వండి. – ఖానమ్‌
సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ ఉన్నవాడు!!విఫల ప్రయత్నాల తరువాత కాస్త ఇన్‌ఫీరియర్‌గా ఫీల్‌ అవుతున్నాడు!!అది తన పోరాటం! తనే చెయ్యాలి!!తనని తాను గెలుచుకోవాలి!!ఆ తరువాతే నిన్ను గెల్చుకోవాలి!!లేకపోతే లైఫ్‌లో ఎప్పుడూ కాన్ఫిడెంట్‌గా ఉండలేడు!!నువ్వు వెయిట్‌ చెయ్యగలిగితే చెయ్యి!కానీ ఆశ పెట్టుకోవద్దు!!నీకు నాన్న గౌరవం కూడా ఇంపార్టెంట్‌!!ఒకరిని పెంచడానికి ఇంకొకరిని తగ్గించే పని ఎప్పుడూ చెయ్యకు!!వెయిట్‌! ఇఫ్‌ యు కెన్‌!గాడ్‌ బ్లెస్‌ యు!!‘చాలా సీరియస్‌గా ఆన్సర్‌ ఇచ్చారు సార్‌!!’అలా కాదు నీలాంబరీ..! ఇంకొకరి లైఫ్‌ని బాగు చేస్తూ చేస్తూ ఆడపిల్ల తనని తాను మరచిపోతుంది. ‘‘మరచిపోకు బెహన్‌’’ అని చెప్పాలనిపించింది అంతే!!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top