నన్నడగొద్దు ప్లీజ్‌

 love doctor solve the problems - Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సార్, నన్ను ఒక అబ్బాయి ఇష్టపడుతున్నానని చెప్పాడు. ఎట్‌ ద సేమ్‌ టైమ్‌ ‘‘మా ఇంట్లో ఒప్పుకోరు.. పేరెంట్స్‌ని హర్ట్‌ చెయ్యను’’ అంటున్నాడు.  ‘‘నువ్వు కావాలి. ప్లీజ్‌ డోన్ట్‌ లీవ్‌ మీ’’ అంటున్నాడు. నాకూ తనంటే ఇష్టమే. గుడ్‌ క్యారెక్టర్‌. తనూ నేను ఒకేచోట జాబ్‌ చేస్తున్నాం. టూ మంత్స్‌ బ్యాక్‌ చెప్పాడు ఈ లవ్‌ మ్యాటర్‌. చాలా మంచి పర్సన్‌. నాకు కూడా తనని వదులుకోవాలని లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి. మంచి సలహా ఇవ్వండి అన్నయ్య! – పార్వతి
పార్వతీ! వెంటనే వదిలెయ్యి! ‘హవ్వ.. హవ్వ... వదిలేయమంటారేంటి సార్‌..? మీ లవ్‌ డాక్టర్‌ ఉద్యోగం మీరు వదిలేస్తారా సార్‌? అంత ఈజీగా లవ్‌ మ్యాటర్‌ వదిలెయ్యమంటున్నారు.? ఎంత పాషాణ హృదయులు సార్‌ మీరు...!’ పాషాణా అంటే...? ‘అంటే... దయ లేని హృదయం అని సార్‌!’ సార్‌.. సార్‌... అంటూనే తెగ తిడుతున్నావుగా నీలూ..! ‘రామచంద్ర!! నేను..?? ఏదీ నేను..?? మిమ్మల్ని..?? ఏదీ మిమ్మల్ని..?? తిడతానా సార్‌??’ మరి పాషాణ హృదయుడు అంటే మెడలో దండ వేసినట్టా? చేతికి పూలగుత్తి ఇచ్చినట్టా? వలిచి అరటిపండు పెట్టినట్టా? అంత తిట్టు తిట్టి... పెద్ద ఫీలింగ్‌ ఇస్తున్నావేంటి నీలూ..? ‘సార్‌ హృదయం ఉంటే లవ్‌ వదిలెయ్యమంటారా సార్‌..?? ఆ ఉద్రేకంలో ఏదో స్పీకాననుకుని క్షమించెయ్యండి!! మంచి బనానా స్వీట్‌ చేసి తాగిస్తా..!!’

బాగా ప్రేమిస్తున్నాడట! ఇంట్లో వాళ్లు ఒప్పుకోరట!! అంటే... ప్రేమించి వాడుకుని.. సారీ చెబుతాడని కాదా..??? ఇదొక ఎక్స్‌క్యూజ్‌ అయిపోయింది. ప్రేమించడానికి అమ్మాయి ఫ్రీగా కావాలి.. పెళ్లికి మాత్రం కట్నం తేవాలి. డర్టీ ఫెలో..! నిజంగా ప్రేమిస్తే పేరెంట్స్‌నేంటి..? దేవుడినైనా ఎదిరించాలి...!! చేస్తున్నది తప్పు కానప్పుడు దేనికయినా ఫైట్‌ చెయ్యాలి. పేరెంట్స్‌ని కన్విన్స్‌ చెయ్యాలి. ఎవరైనా తన సిస్టర్‌తో ప్రేమ కలాపం నడిపి.. పేరెంట్స్‌ ఒప్పుకోలేదంటే ఊరుకుంటాడా? వాడి సిస్టర్‌ అయితే ఒక నీతి. నా సిస్టర్‌ అయితే ఇంకో నీతా? ఐ డోంట్‌  యాక్సెప్ట్‌..!!!! అంతే ఫైనల్‌.....!
‘సార్‌ తగ్గండి తగ్గండి కోపంలో తొక్క కూడా తినేస్తారేమో.. ప్లీజ్‌ కామ్‌ డౌన్‌ సార్‌!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top