నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Nov 8 2017 12:00 AM | Updated on Nov 8 2017 12:00 AM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ అన్నయ్యా! నాకు ఇప్పుడు 23 ఇయర్స్‌. నా స్కూల్‌ ఏజ్‌లో ఉన్నప్పుడు నా సీనియర్‌ నన్ను లవ్‌ చేస్తున్నా అని చెప్పాడు. వన్‌ ఇయర్‌ తరువాత నేను కూడా ఓకే చెప్పాను. ఇప్పటికి మా లవ్‌ రిలేషన్‌ స్టార్ట్‌ అయ్యి ఎయిట్‌ ఇయర్స్‌ అయ్యింది. స్టార్టింగ్‌లో బాగానే ఉన్నాం. రోజులు గడిచేకొద్దీ నాలో ప్రతీదీ ఫాల్ట్‌లా చూడ్డం మొదలుపెట్టాడు. చాలా డామినేట్‌ చేస్తుండేవాడు. తనని వదులుకోవడం ఇష్టం లేక తను ఏది చెబితే అదే చేశాను. అయినా సరే చిన్న చిన్న విషయాలకు గొడవపడేవాడు. తనకోసం నా ఫ్రెండ్స్‌ని కూడా వదిలేశాను. తను తప్ప నాకు వేరే లోకమేలేదు. అయినా కూడా తప్పులు వెతుకుతుండేవాడు. ఏం చేసినా తప్పు అనేవాడు. తను ఒక అమ్మాయితో క్లోజ్‌గా ఉండేవాడు. ఎంత చెప్పినా వినలేదు. కొన్నాళ్లకి తను నన్ను ఫిజికల్‌గా కావాలనుకున్నాడు. అలా దగ్గరైతే నాతోనే ఉండిపోతాడని నేను కూడా ఒప్పుకున్నాను. ఇప్పుడు చిన్న గొడవతో నన్ను వదిలేశాడు. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని.. వేరే అమ్మాయికి ప్రపోజ్‌ కూడా చేశాడు. నాకు ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఇంకొకరితో ఎలా ఉండాలో అర్థం కావడంలేదు. ప్లీజ్‌ ఏదైనా మంచి సలహా ఇవ్వండి. – నిఖిత
నీకు ప్రాబ్లమ్‌ వచ్చిందనుకుంటున్నావా నిఖితా? ‘ఇప్పుడు వచ్చింది ప్రాబ్లమ్‌ కాదా సార్‌? అబ్బాయి ఉన్నన్ని రోజులు టార్చర్‌ చేశాడు. ఇప్పుడు వదిలేసి టార్చర్‌ చేస్తున్నాడు. ఇది ప్రాబ్లమ్‌ కాదా సార్‌??’
కాదు!! ‘ఏంటి సార్‌ మీరు అలా మాట్లాడితే అసలు మీకు గుండె లేదేమో అన్నంత కోపం వస్తుంది. అక్కడ మీ సిస్టర్‌ అంత ప్రాబ్లమ్‌తో రాస్తే... మీరు చాలా లైట్‌ తీసుకుంటున్నారు. ఏమి పట్టనట్టు ఉంటున్నారు? అబ్బాయిలంటే ఇష్టమయిన నాకే... వాడ్ని పోయి నాలుగు పీకాలని ఉంది. మీరు అంత పెద్ద మీసాలు పెట్టుకుని ఏమి లాభం సార్‌..? ప్రాబ్లమ్‌ అర్థం చేసుకోరెందుకు సార్‌??’అయ్యిందా.. నీ ఎమోషనల్‌ అటాక్‌..!?! మరీ అంత దగ్గరకొచ్చి కొట్టేలా మాట్లాడుతున్నావ్‌? ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను. నువ్వు అలా కోపంగా అంత దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే మై మీసం ఈజ్‌ వణికింగ్‌!! నాకు తెలిసి ప్రాబ్లమ్‌ రాలేదు. పోయింది!!

‘అంటే.. ఏంటి సార్‌..? మోసం చేసి ఫిజికల్‌గా వాడేసుకుని.. మెంటల్‌గా టార్చర్‌ చేసి.. ఇప్పుడు ఇంకో అమ్మాయికి లైన్‌ వేస్తే ప్రాబ్లమ్‌ పోయిందంటారేంటి సార్‌??’వాడు మనల్ని వాడుకున్నా.. మనల్ని పారేసినా.. దానికి కారణం మనమే!!‘సార్‌.. అన్యాయం సార్‌.. తప్పు మీ సిస్టర్‌ ది అంటారా?!? క్రేజీ.. వెరీ వెరీ క్రేజీ!!’ముందునుంచి వాడి క్యారెక్టర్‌ చూపిస్తూనే ఉన్నాడు! అయినా వాడి డర్టీ మైండ్‌ని అర్థం చేసుకోకుండా వాడు ఆడిందే ఆట అన్నట్లు అన్నింటికీ తలాడించి.. తన లైఫ్‌ని ఒక వెధవ చేతిలో పెట్టింది నా చెల్లెలే.ఇప్పటికయినా అలాంటి దరిద్రుడు లైఫ్‌ నుంచి పోయాడని అర్థం చేసుకుని స్ట్రాంగ్‌ అవ్వాలి.
‘మరి ఫిజికల్‌గా వాడుకున్నాక ఇంకొకరితో కాపురం చెయ్యాలంటే మనసు ఒప్పుకోవాలి కదా సార్‌? చీట్‌ అవ్వడమే కాక ఇంకొకరిని చీట్‌ చేసినట్టు కదా సార్‌??తప్పు నీలూ...! నిఖిత మానసికంగా.. శారీరకంగా రేప్‌కి గురయ్యింది. తాను చెయ్యని తప్పుకు గాయం అయ్యింది. రేప్‌ అయినా వాళ్లకు పెళ్లి జరగకూడదా? వాళ్లు మళ్లీ మంచి జీవితం జీవించకూడదా? నేరం మగవాడు చెయ్యాలి, శిక్ష ఆడది భరించాలా? సారీ నీలూ.. లైఫ్‌ని అలా ట్రీట్‌ చెయ్యకూడదు. పెళ్లి చేసుకుని నిఖిత సంతోషంగా జీవించాలి!!‘మరి ఆ దరిద్రుడు??’కుక్క తోక..! ఎవరో ఒకరు దాన్ని కత్తిరిస్తారు. ఇప్పుడు ఆలోచించాల్సింది నిఖిత గురించి..! లవ్‌ యు చెల్లెమ్మా!!!‘లవ్‌ యు నిఖితా... ఆల్‌ ది బెస్ట్‌ ఫర్‌ ఎ న్యూ లైఫ్‌!!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement