నన్నడగొద్దు ప్లీజ్‌

love doctor solve the problems - Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నయ్యా! నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్‌ చేశాను. కానీ మా అభిప్రాయాలు అసలు కలవలేదు. నేను ఒక అబ్బాయితో క్లోజ్‌గా ఉండేదాన్ని. అది తనకి నచ్చేది కాదు. దాంతో నన్ను బాగా బ్లేమ్‌ చేసేవాడు. అందుకే ఆ రిలేషన్స్‌ కరెక్ట్‌ కాదనిపించింది. బట్‌ ఇప్పుడు నేను క్లోజ్‌గా ఉండే అబ్బాయి నన్ను బాగా ప్రేమగా చూసుకుంటున్నాడు. పెళ్లి చేసుకుంటానని అడుగుతున్నాడు. కానీ నేను ఇంకా ఒప్పుకోలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి. మీరే నా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్‌ చెప్పాలి ప్లీజ్‌. – ప్రియ

ఏంటమ్మా ఒప్పుకునేది..? ఒకడు సరిగా చూసుకోకపోయినా ఒప్పుకోవాలా? ఒకడు బాగా చూసుకుంటున్నాడు కాబట్టి ఒప్పుకోవాలా? వాడెవడో ఇష్టపడితే ఓకే చెప్పాలా? ఇంకెవడో వెంటపడ్డాడు కాబట్టి ఎస్‌ చెప్పాలా? స్టాప్‌ ఇట్‌ చెల్లెమ్మా..!! ‘మరి ఎవరికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాలి సార్‌? ఇలా అందరికీ రెడ్‌ సిగ్నల్‌ చూపిస్తూ ఉంటే అమ్మాయికి ప్రపోజల్స్‌ రావు! మీకు ఉత్తరాలు రావు!! అన్నాచెల్లెళిద్దరూ ఉత్తరాలు రాసుకోవాల్సిందే. ‘‘హౌ ఆర్‌ యు చెల్లెమ్మా..? నో ప్రపోజల్స్‌ అన్నయ్యా..! నో ఉత్తరాలు చెల్లెమ్మా..! నో లైఫ్‌ అన్నయ్యా..!’’ అని ఇద్దరూ రాసుకోవాల్సిందే సార్‌!!’ నీలాంబరీ.. నన్ను చెప్పనిస్తావా? ‘ఎస్‌ సార్‌.. గ్రీన్‌ లైట్‌ ఆన్‌ సార్‌!!’ అవేం పట్టించుకోకు బంగారం..! ముందు నీకు నచ్చాలి..! నీకు ఇష్టం కలగాలి..!

తాను లేకుండా ఉండలేననిపించాలి..!! అప్పుడు నీ కెరియర్‌ సెటిల్‌ అయ్యాక.. పెళ్లి గురించి ఆలోచించాలి.!! లేకపోతే వాడి కోసం నీ జీవితం రాసిచ్చిన దానివి అవుతావు బంగారం. యు ఆర్‌ మై సిస్టర్‌.. యు ఆర్‌ మై సూపర్‌ స్టార్‌!!‘సార్‌ అబ్బాయిలను తిడతారు.. అమ్మాయిలను పెళ్లి చేసుకోవద్దంటారు. యు ఆర్‌ నాట్‌ లవ్‌ డాక్టర్‌.. యు ఆర్‌ సాడిస్ట్‌ డాక్టర్‌ అని అందరూ అనుకుంటారేమోనని ఐ యామ్‌ వర్రీడ్‌ సార్‌!!’ ఎవరు ఏమనుకుంటారో అని చెప్పేబదులు... నువ్వు అలా అనుకుంటున్నానని చెప్పావు! నువ్వు చాలా స్మార్ట్‌ నీలూ!! ‘సార్‌... అరటిపండు మీద ఒట్టు వేసి చెబుతున్నాను సార్‌!! ఐ యామ్‌ వర్రీడ్‌ ఎబౌట్‌ యువర్‌ ఇమేజ్‌ సార్‌!!’ వర్రీ అవ్వాల్సింది నా ఇమేజ్‌ గురించి కాదు.. అమ్మాయిల లైఫ్‌ గురించి...!! ‘సార్‌ అలా అని మీ ఇమేజ్‌ బాగానే పెంచుకున్నారు సార్‌’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top