
హాయ్ సర్! నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చాలా సమస్యలతో బాధపడుతోంది. వాళ్ల పేరెంట్స్‌కి తను ఎంత హెల్ప్ చేసినా సరే, తనను వాళ్లు ప్రేమగా చూసుకోరట. చిన్న పొరబాటు చేసినా బాగా తిడతారట. తనని అసలు ఇంట్లో పర్సన్‌గానే చూడరట. నాతో చెప్పి చాలా బాధపడింది. ‘‘నా పేరెంట్స్‌కి నా పైన అసలు ప్రేమేలేదు. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది’’ అంటోంది. ఇలానే ఒకసారి హ్యాండ్ కట్ చేసుకుంది. తను హ్యాపీగా ఉండటానికి సలహా చెప్పండి సార్ ప్లీజ్! – నరేష్
‘సార్ లవ్ డాక్టర్‌కి ఇలాంటి క్వశ్చన్ వస్తే ఏం చెయ్యాలి సార్..?’ ఏమి చెయ్యాలి అంటే..? ‘దీంట్లో లవ్ మ్యాటర్ లేదు కదా సార్!?’ అయితే..? ‘మీరు లవ్ డాక్టర్ కదా సార్!?’ ఫ్యామిలీలో లవ్ ఉండదా.. పెయిన్ ఉండదా.. ఎమోషన్ ఉండదా..? ‘సార్ ఫ్యామిలీ గురించి మీరంతా ప్యాషన్‌తో మాట్లాడుతుంటే.. చాలా ముచ్చటగా ఉంది సార్!!’ నరేష్ అన్నా..! ఆడపిల్ల శాపం అనుకునే రోజులు ఖతం అయ్యిపోయాయి. ఇంటి బయటే కాదు.. ఇంట్లో కూడా అమ్మాయిని ఎవరు కష్టపెట్టినా న్యాయం, చట్టం తాట తీస్తాయి.
అమ్మాయికి జరుగుతున్న ద్రోహాన్ని మనం ఎదుర్కోవాలి. ప్రభుత్వ కౌన్సెలింగ్ సెంటర్స్ ఉంటాయి. పోలీస్ వ్యవస్థ ఉంది. వెంటనే సాయం పొందాలి. మరీ చెయ్యి కోసుకుని ప్రాణం మీదకు తెచ్చుకునే దాకా ఆగడం అన్యాయం. వెంటనే అమ్మాయికి ధైర్యం చెప్పి... సాయం చెయ్యి. యు ఆర్ ది బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ లవ్ డాక్టర్!
‘సార్ బై మిస్టేక్ అబ్బాయిని మెచ్చుకున్నారు సార్!’ అని నవ్వింది నీలాంబరి!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com