
హాయ్ అన్నయ్యా.. నాకు 17 ఏళ్లకే పెళ్లయి పోయింది. తను మా బంధువే. తెలిసీ తెలియని వయసులో మా పెద్దలు పెళ్లి చేసేశారు. ఇప్పుడు నా వయసు 21. పెళ్లి అయ్యి ఇన్నేళ్లు గడిచినా మేము ఫిజికల్‌గా ఒకటి కాలేదు. కారణం తనకు వేరే అఫైర్ ఉంది. నేను స్వయంగా చూశాను. వాళ్ల మాటలు కూడా విన్నాను. ఆఖరికి నేను చేసే వంట కూడా తినరు. నన్ను చూడరు, మాట్లాడరు. నాలుగు గోడల మధ్య నేనొక గోడలా ఉంటున్నాను. మారతారని ఫోర్ ఇయర్స్‌గా ఎదురు చూస్తున్నా. అన్నీ తెలిసి కూడా.. మా అత్తగారు పిల్లలు పుట్టట్లేదని.. పిల్లలు కావాలని గోల చేస్తున్నారు. అవమానిస్తున్నారు. అమ్మావాళ్లకి చెప్పినా తప్పదు భరించాలి, సహించాలి అంటున్నారు. జీవితంపై ఆశలు వదిలేసుకున్నాను. చనిపోవాలని ఫిక్స్ అయ్యాను. ఆ సమయంలో నా క్లాస్‌మేట్ ఓ ఫ్రెండ్ మ్యారేజ్‌లో పరిచయం అయ్యారు. తన ఏజ్ 22. చిన్ననాటి నుంచి ఫ్రెండ్ కావడంతో అన్నీ తనతో షేర్ చేసుకున్నా. ఇప్పుడు తను నాకు మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? దయచేసి సలహా ఇవ్వండి! – సమీర
అమానుషం నాన్నా!! నీ భర్త చేస్తున్నది రాక్షస క్రియ!! తనని ఎవ్వరూ సమర్ధించరు!! దేవుడు కూడా క్షమించడు!! ‘సార్ ఈ ఎమోషన్‌తో చంపేస్తున్నారు సార్..!’\ ఏంటి నీలాంబరీ అసలు మనసు లేని దానిలా మాట్లాడుతున్నావు..?? ‘సార్ ఆల్‌రెడీ మీ సిస్టర్ బాధను అనుభవించింది. ఇప్పుడు మీరేమయినా సొల్యూషన్ చెబుతారని రాసింది. ఇంకా ఈ డర్టీ హజ్‌బెండ్ గురించి ప్రస్తావిస్తే బాధ కలగదా సార్..? ఇన్‌సెన్సిటివ్ మీరా నేనా సార్!?’ బాగా ఎదిగిపోయావు నీలూ..!! ఎంతగా ఎదిగిపోయావంటే......‘సార్.. పొగడకండి సార్ సిగ్గేస్తుంది.
అయినా అంతా మీ ట్రైనింగే కదా సార్!’ నాలుగు ఏళ్లు నరకం చూశావు చెల్లెమ్మా.. అమ్మ, నాన్న కూడా నిన్ను అదే నరక కూపంలోకి మళ్లీ మళ్లీ నెట్టేశారు. నువ్వు నీ ఫ్రెండ్‌ని చేసుకుంటావా.. లేదా.. అన్నది ఇంపార్టెంట్ అనిపించడం లేదు. ముందు నువ్వు పడ్డ టార్చర్‌కి వాడు మూల్యం చెల్లించాలి. నీకు తెలిసిన లాయర్‌ని కలువు. ఒకవేళ నీకు ఎవరూ తెలియకపోతే.. నీకు దగ్గర్లో ఉన్న లాయర్‌ని సాక్షి అరేంజ్ చేస్తుంది. వెంటనే సంప్రదించి నీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని వెతుక్కో! ఆ తరువాత ఆ ఫ్రెండ్ ఏంటో... ఆ విషయం ఏంటో.. తేల్చుదాం!! లవ్ యు బంగారు తల్లీ!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com