నన్నడగొద్దు ప్లీజ్‌

love doctor solve the problems

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నయ్యా... నేను ఒక అబ్బాయిని వన్‌సైడ్‌ లవ్‌ చేస్తున్నాను. తనని బయట చాలా సార్లు చూశాను. తన హెల్పింగ్‌ నేచర్‌ చూసి ఇష్టపడ్డాను. ఒకసారి ఎఫ్‌బిలో తన పిక్, మొబైల్‌ నెంబర్‌ తీసుకుని మెసేజ్‌ చేశాను. బాగానే మాట్లాడేవాడు. నేను ఫ్రెండ్లీగా మాట్లాడేదాన్ని. ఒక రోజు కూడా తనకి మెసేజ్‌ చేయకుండా ఉండలేకపోయేదాన్ని. నా డీటైల్స్‌ ఏం అడిగినా తనకి చెప్పేదాన్ని కాదు. తనంటే నాకు చాలా ఇష్టం. సమస్య ఏమిటంటే... తను నా కంటే వన్‌ అండ్‌ ఆఫ్‌ ఇయర్‌ చిన్నవాడు. అందుకే ప్రపోజ్‌ చేయలేదు. నా పేరెంట్స్‌ నాకు ఏదీ లోటు చేయలేదు. నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. వాళ్లని మోసం చేయడం ఇష్టం లేదు. ఆ అబ్బాయి ఏమో నీ డిటైల్స్‌ చెప్పు, మెసేజ్‌లు కాకుండా కాల్‌ చెయ్యి.. లేదంటే నన్ను వదిలెయ్‌ అంటున్నాడు. నాకు మా పేరెంట్స్‌ని మోసం చేసి తనతో ఫోన్‌ మాట్లాడడానికి మనసు అంగీకరించడం లేదు. అలా అని తనని మర్చిపోలేకపోతున్నా. నేను తన కన్నా పెద్ద అనే విషయం తనకి తెలియదు. స్టడీస్‌ మీద ఇంట్రెస్ట్‌ పెట్టలేకపోతున్నా. తనే చాలా చాలా గుర్తుకు వస్తున్నాడు. ఎంత మర్చిపోదాం అన్నా సరే నా వల్ల కావడం లేదు. ప్లీజ్‌ సలహా ఇవ్వండి. – సునీత
‘సార్‌ ఏజ్‌ ప్రాబ్లమా?’ డిపెండ్స్‌! ‘అంటే కొంత మందికి ప్రాబ్లమ్, కొంతమందికి కాదనా సార్‌?’ ఎస్‌! ‘అన్నీ సింగిల్‌ వర్డ్స్‌లో సమాధానాలిస్తున్నారు?’ రియల్లీ! ‘సార్‌ బోర్‌ కొడుతోంది. సునీతకి ఏదో ఒకటి చెప్పండి సార్‌!’ వయసుదేమున్నది సునీతా ఇట్‌ ఈజ్‌ ఇన్‌ ది మైండ్‌! ‘సార్‌ ఇంగ్లిష్‌ సుత్తి వద్దు సార్‌...! తెలుగులో కొట్టండి..!!’ చిన్న, పెద్ద అన్నది ప్రేమలో కనపడే విషయాలు కావు! చిన్నతనం పెద్దరికం కూడా కనపడవు! కనపడేదల్లా ప్రేమే!! అబ్బాయికి నిజం చెప్పేస్తే.... వాడి ప్రేమ మనకు అర్థం అవుతుంది! సునీత గెలుస్తుందో.. వాడు ఓడిపోతాడో... నిజం చెప్పగానే తెలుస్తుంది!! ‘కొటేషన్‌లా ఉంది సార్‌... ఒకరు గెలుస్తారో మరొకడు ఓడుతారో ప్రేమే నిర్ణయిస్తుంది. వాహ్‌...వా...! సార్‌!!’ రియల్లీ!?!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top