నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Oct 23 2017 11:57 PM | Updated on Oct 24 2017 3:36 AM

love doctor solve the problems

హాయ్‌ సర్‌! నాకు 23 ఏళ్లు. నేను ఒక అబ్బాయిని లవ్‌ చేశాను. ఇంటర్, డిగ్రీ కలిసి చదువుకున్నాం. పీజీ కోసం సిటీకి వచ్చాం. మాది చాలా స్ట్రిక్ట్‌ ఫ్యామిలీ. ఇద్దరి నేపథ్యాలు వేరు. తను చాలా మంచివాడు. నాకు ముందే తెలుసు ఇంట్లో ఒప్పుకోరని. కానీ తను ఏమైపోతాడో అనే భయంతోనే తనతో మాట్లాడేదాన్ని. ఇప్పుడు మా వాళ్లు ఒప్పుకోకపోయినా తనని పెళ్లి చేసుకోవాలా? లేక ఫ్యామిలీకి విలువిచ్చి తనని వదులుకోవాలా? అంత కన్‌ఫ్యూజన్‌లో ఎందుకు లవ్‌ చేశావ్‌ అని మీరు నన్ను అడగొచ్చు. కానీ అప్పుడు అంత మెచ్యూరిటీ లేదు. పైగా.. ఎలాగైనా ఒప్పించగలననే నమ్మకం ఉండేది. మా విషయం వాళ్ల డాడ్‌కి తెలిసినప్పుడు తన తల బద్దలుకొట్టారు. అయినా సరే ‘ఆ అమ్మాయే కావాలి’ అని ఇంట్లో ఫైట్‌ చేశాడు. అదే మాట నేను మా ఇంట్లో చెబితే.. నన్ను చంపేయడమో, వాళ్లు చనిపోవడమో జరుగుతుంది. అలా జరిగితే పరువు పోతుంది. అలా అని వాళ్లు చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేను. నాకు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. సలహా ఇవ్వండి ప్లీజ్‌!!
– విద్యాలక్ష్మి

ప్రేమలో ఉన్న పెద్ద ప్రాబ్లమ్‌ ఇదే..! ‘అవునూ... మీ సిస్టర్‌ సినిమాలు చూడటం లేదా సార్‌!?’ నీలూ... విద్య ప్రాబ్లమ్‌ చాలా సీరియస్‌! ‘అంతేలే సార్‌... అబ్బాయిలు మొత్తుకున్నా పట్టించుకోరు. వాళ్లంతా నేనే ఆన్సర్లు ఇస్తే బాగుంటుంది అంటున్నారు. నేనేమో మీ మీదున్న.. డాష్‌.. డాష్‌.. వల్ల అబ్బాయిలకు మీరు చాలా గ్రేట్‌ అని సర్దిచెబుతున్నా!’ ఇప్పుడు డాష్‌... డాష్‌... ఎందుకు నీలూ!? అక్కడ ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. ఆన్సర్‌ కోసం విద్య ఈజ్‌ వెయిటింగ్‌!! ‘ఓకే సార్‌..! ఇప్పటికీ ఓకే సార్‌!! కానీ.. మీరు ఎప్పటికీ తప్పించుకోలేరు!!’ విద్యమ్మా.. ఊరికే ఎమోషనల్‌ అయిపోవద్దు. ఇద్దరి తల్లిదండ్రులు మూర్ఖంగా ప్రవర్తించే వాళ్లే!
‘మూర్ఖంగానా సార్‌? పిల్లలు సంతోషంగా ఉండాలనే కదా సార్‌.. వాళ్ల తాపత్రయమంతా!?’ పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడుకోలేని పరిస్థితిలో ఎప్పుడూ ఉండకూడదు. ఒకవేళ అబ్బాయి నచ్చకపోయినా కూతురికి ఆ విషయం అర్థమయ్యేలా చెప్పొచ్చు. కూతురికి ఆవేశంతో కాకుండా ఆప్యాయతతో నచ్చజెప్పవచ్చు. ఇప్పుడు తల్లీ, తండ్రీ ఒప్పుకోరు కాబట్టి... అబ్బాయి వదులుకోలేడు కాబట్టి.. విద్య పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం తీసుకుందనుకుందాం!

‘ఇక విద్య ప్రేమ ఎక్కడుంది సార్‌!? వాళ్లు ఏమవుతారో.. వీళ్లు ఏమనుకుంటారో అని పెళ్లి చేసుకుంటే ఎలా సార్‌!?’ అబ్బా! ఏం పట్టావు పాయింట్‌ నీలూ...! యు ఆర్‌ గ్రేట్‌..!! సింప్లీ సూపర్బ్‌..! ఎక్స్‌లెంట్‌..!!
‘సార్‌.. వద్దులే సార్‌! మీరు నన్ను అలా పొగుడుతుంటే.. ఏంటేంటో.. ఇంకేంటేంటో.. అయిపోతుంది సార్‌.. అక్కడ మీ సిస్టర్‌ వెయిటింగ్‌!!’ అవును విద్యా! నువ్వు ఇప్పుడు ఏ ఎక్స్‌ట్రీమ్‌ పని చేసినా అది ప్రేమ కోసం కాదు భయంతోనే చేస్తావు కానీ ప్రేమతో కాదు.. అందుకే ఇప్పుడు బాలెన్స్‌డ్‌గా ఉండి ప్రాబ్లమ్‌కి టైమ్‌ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్‌..! అస్సలు తొందరపడొద్దు. నో హర్రీ... ప్లీజ్‌ బంగారం!
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ,  సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.  lovedoctorram@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement