
హాయ్ అన్నయ్యా, ఇది నా ఫ్రెండ్ స్టోరీ. ఆ అమ్మాయి వాళ్ళ అత్తయ్య కొడుకు... తనకన్నా ఒక సంవత్సరం చిన్నవాడు. ఈ అమ్మాయిని లవ్ చేశాడు. తనకు ఆ లవ్ మీద అస్సలు ఇంట్రస్ట్ లేదు. నమ్మకం కూడా లేదు. ఆ అబ్బాయి నా ఫ్రెండ్‌కి ఫోర్త్ క్లాస్‌లో ప్రపోజ్ చేశాడు. నా ఫ్రెండ్‌కి లవ్ అంటే ఏంటో అంత క్లారిటీ లేక, తెలియక అప్పుడు బాగానే మాట్లాడేది. తర్వాత తర్వాత పెద్దయిన తర్వాత మాట్లాడటం లేదు. ఫ్యామిలీ పార్టీల పేరుతో అతడిని ఫ్రీక్వెంట్‌గా కలవాల్సి వచ్చింది. బట్ తను మాట్లాడదు. ఫేస్‌బుక్‌కి ప్రొఫైల్ మార్చి రిక్వెస్ట్ పెడితే బ్లాక్ చేసింది. మెసేజ్‌లు, రిక్వెస్ట్‌లు వస్తే తిట్టి, రిజెక్ట్ చేసి, బ్లాక్ చేసింది. నిజానికి, తన ప్రాబ్లమ్ ఏమిటంటే, ఆ అబ్బాయి తనని లవ్ చేయకుండా వుండాలంటే ఏం చెయ్యాలి. తనకు కెరీర్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఈ డిస్ట్రబెన్స్ ఎక్కువ అవుతోంది. అతడిని ఎలా అవాయిడ్ చెయ్యాలో అర్థం కావడం లేదు. ప్లీజ్.. అన్నా సలహా ఇవ్వండి. - ఉమ
‘సార్.. మీకు కనెక్షన్ కట్ చెయ్యమని ఏ చెల్లెలు ఎప్పుడు అడుగుద్దా అని ఎదురు చూసే బ్యాడ్ హ్యాబిట్ ఉందని ఉమకు తెలియదు సార్..!’ అంటే నేను ప్రేమని రెస్పెక్ట్ చెయ్యనా? ‘ఎందుకు సార్ అంత అమాయకమైన ఫేస్ పెట్టి అంత అమాయకంగా అడుగుతున్నారు.? ఈ రెండు రాష్ట్రాల్లో మీకు ఏమి పేరుందో తెలుసా సార్...??’ లవ్ డాక్టర్... ద వన్ అండ్ ఓన్లీ తెలుగు లవ్ డాక్టర్... సూపర్ డూపర్ లవ్ ప్రాబ్లమ్ సాల్వర్! తొక్కలో మాటలు చెప్పకండి సార్... లవ్ డిగ్రీ కూడా లేదు. లవ్ ఎక్స్‌పీరియెన్స్ కూడా లేదు. అసలు లవర్ లేదు. లవ్ స్పెల్లింగ్ కూడా తెలియదు. ‘మీరేంటి సార్, మిమ్మల్ని మీరే ఏదో అనేసుకుంటే లవ్ డాక్టర్ కాదు లవ్ జోకర్ అనుకుంటారు సార్..’ రీడర్స్‌కి అనవసరమయిన ఐడియాలు ఇవ్వకు నీలాంబరీ!! ‘సరే సార్ మీ చెల్లెలి ఫ్రెండ్‌కు ఐడియా ఇవ్వండి సార్!!’
కట్ చేసి బ్లాక్ చేసి చీదరించుకున్నా సోపు వేస్తున్నాడు... అంటే కొబ్బరి పీచుతో జిడ్డు తోమాల్సిందే!!‘ఎలా సార్?’ లవ్ జోకర్లు ఏమి చెబుతారులే...! ‘సార్... సార్.. చెవులు పట్టుకుని గుంజిళ్లు తీస్తా!! ఏదో ఫ్లోలో మిమ్మల్ని జోకర్ అన్నాను కానీ, అసలు మీరు..’ వద్దులే విషయం అర్థమయ్యిందిలే నీలాంబరీ! ఉమ బంగారం... కొబ్బరి పీచు రఫ్‌గా ఉంటుంది. నీ ఫ్రెండ్ సాఫ్ట్‌గా చెప్పినా వినకపోతే కొంచెం స్ట్రాంగ్ డోస్ ఇవ్వాలి. పేరెంట్స్‌కి చెబితే వాళ్లు కరెక్టుగా తోముతారు! నిజమయిన ప్రేమ ఇస్తుంది కానీ కోరుకోదు. అమ్మాయి కావాలి అనుకోవడం కన్నా... అమ్మాయి ప్రేమ కావాలి అనుకోవడం కన్నా... అమ్మాయి సంతోషంగా ఉండాలి అనుకోవడమే ప్రేమ ఇవ్వడం అంటే!! అబ్బాయి మంచివాడయితే... ప్రేమ నిజమయితే... హీæవిల్ రెస్పెక్ట్ హర్ ఫీలింగ్స్!! ‘అమ్మాయిని గౌరవిస్తాడు. సార్ మీరు బెస్ట్ లవ్..’ వద్దు!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com