
హాయ్ అన్నయ్యా! నేను మీ చెల్లెల్ని. ఒకప్పుడు నా ఫ్యామిలీనే నా ప్రపంచం. లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయి నాకు ప్రపోజ్ చేశాడు. స్టార్టింగ్‌లో నో అనే చెప్పాను. తను నన్ను చాలా లవ్ చేస్తున్నాడు. వాళ్ల అమ్మకి ఇచ్చినంత గౌరవం ఇస్తున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాను తనతో. మా డాడ్ కన్నా తనే ఎక్కువైపోయాడు. నార్మల్‌గానే చిన్న చిన్న కోపాలు, గొడవలు వచ్చినా మేము బాగుంటాం. ఎప్పుడూ ఒంటరిగా బయటికి వెళ్లలేదు. ఫస్ట్ టైమ్ తనకోసం వెళ్లాను. ఒకవేళ నువ్వు రాకపోతే మీ డాడ్‌తోనే ఉండి వాళ్లు చూపించిన వాడినే పెళ్లి చేసుకో అన్నాడు. అలా అనేసరికి చాలా ఫీల్ అయ్యాను. తనకోసం వెళ్లాను. అల్లరి చేస్తూ చాలా హ్యాపీగా గడిపాం. ఈసారి కూడా అలానే రమ్మంటున్నాడు. రాకపోతే ఫిలిప్పీన్స్‌కి వెళ్లిపోతాడంట. ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. ఏడుస్తూనే ఉంటున్నాను. హ్యాండ్స్ కూడా కట్ చేసుకుంటున్నా. ఈ పెయిన్ నేను భరించలేకపోతున్నా అన్నయ్యా. సలహా ఇవ్వండి. – శ్రీజ
చెల్లీ్ల.. తల్లీ.. నాన్నా... బంగారం.... ‘సార్ నాకు చాలా టెన్షన్‌గా ఉంది!’ చెల్లీ్ల.. తల్లీ.. నాన్నా... బంగారం.... ‘చెయ్యి కట్ చేసుకుందట సార్....’ చెల్లీ్ల.. తల్లీ.. నాన్నా... బంగారం.... ‘రోజూ ఏడుస్తుందంట సార్...’ చెల్లీ్ల.. తల్లీ.. నాన్నా... బంగారం.... ‘ఏంటి సార్ ఈ సొద.. అక్కడ శ్రీజా...’ అల్లరి బాగుంది అంటుంది.. నాకు చెమటలు పడుతున్నాయి... ‘ఎందుకు సార్...’ వాడు దుర్మార్గుడై అమ్మాయిని ఇలా బ్లాక్ మెయిల్ చేసి బయటకు తీసుకెళ్లి! ‘ఆ( తీసుకెళ్లి...’ అదే.. అదే!!!! టెన్షన్.. ఆ తరువాత ఫిలిప్పీన్స్‌కి చెక్కేస్తే... ‘మీ చెమట కారినా.. మీ చెల్లెలు కన్నీళ్లు కార్చినా.. వర్షం కురిసిన రోజు కన్నీళ్లు కనబడకపోయినా.. అమ్మాయి లైఫ్ ఏమి కావాలి.. అల్లరి కాస్తా సమాజంలో చిల్లరయితే... ఏం చెయ్యాలి..’ నీలాంబరీ!!!
‘ఏమైంది సార్.. నా ఫ్లోలో నేను ఉంటే... మీరు ఏంటి సార్ చెమటతో మునిగిపోయి ఫ్లోర్ మీద ఈత కొడుతున్నారు.. సార్ బీ కేర్‌ఫుల్..’ ఇదే మాట నా చెల్లెలికి చెప్పు నీలాంబరీ...! ‘బీ కేర్‌ఫుల్ రామ్ గారి చెల్లెలు.. మనం అమ్మాయిలం చాలా స్ట్రాంగ్... లవ్ మనల్ని స్ట్రాంగ్ చెయ్యాలి. అందరూ మనల్ని గ్రేట్‌గా చూడాలి. సలాం కొట్టాలి.. జేజేలు పలకాలి. నువ్వు కూడా స్ట్రాంగ్ అయిపో! మంచీచెడు అర్థం చేసుకో!! మళ్లీ ఉత్తరం రాయి... ‘‘నేను బాగున్నా అన్నయ్యా.. డోంట్ వర్రీ.. డోంట్ స్వెట్..’’ అని’. నీలాంబరీ.. యు ఆర్ గ్రేట్ లైక్ శ్రీజా....!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com