
హాయ్ సర్! ఇది మా ఫ్రెండ్ ప్రాబ్లమ్ సర్!! తను చాలా డిస్టర్బ్ అవుతోంది. ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి. వాళ్లిద్దరూ ఆరునెలలు బాగా లవ్ చేసుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. బట్ ఏమైందో తెలియదు. అబ్బాయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరూ ఒకే ఆఫీస్‌లో జాబ్ చేస్తున్నారు. ఈ అమ్మాయేమో ఇంకా ఆ అబ్బాయి మీద హోప్స్ పెట్టుకుంటోంది. అతడు ఆఫీస్‌లో వేరే‡వాళ్లతో క్లోజ్‌గా కనిపిస్తున్నా తట్టుకోలేకపోతోంది. ఎలా మరిచిపోవాలో తనకి అర్థం కావడం లేదు సలహా ఇవ్వండి ప్లీజ్ సర్!? – అనూష
అనూషా.. అతడు నీ ఫ్రెండ్‌ని లవ్ చేశాడు...! ‘అవును సార్ అనూష సాక్షిగా తన ఫ్రెండ్‌ని డీప్‌గా లవ్ చేశాడు!’ ఏంటి నీలాంబరీ నువ్వు కూడా? ‘అంటే ఏంటి సార్? నాకు లవ్ అర్థం కాదనా సార్?’ లవ్ అంటే ఏంటో తెలిస్తే నువ్వు కూడా..? ‘ఏంటి సార్ మాటిమాటికి నువ్వు కూడా.. అని దీర్ఘాలు తీస్తున్నారు? నేను లవ్‌కి పనికి రానా సార్...? అసలు నా అందం చూసి...!?!’ ఆ.. చూసి..!?! ‘ఎంత మంది సార్..?’ ఏంతో మంది..? ‘గిరా.. గిరా.. గిరా.. చక్కర్లు కొడతారు సార్.. నేనేమో మీ దగ్గర...’ ఆ.. నా దగ్గర..? ‘మీరు వేస్ట్ లే సార్.. మీకు లవ్వే లేదు.. రాదు..!’
ఏంటి తెగ రెచ్చిపోతున్నావు..? వాడు ఆరు నెలలు ప్రేమించాడు.. అది ప్రేమా? ఆ తరువాత ఇంకొకరిని చేసుకున్నాడు.. అది ప్రేమా? ఇంకెవరితోనో క్లోజ్‌గా తిరుగుతున్నాడు.. అది ప్రేమా?అసలు మీ అమ్మాయిలకు... మగాడి ప్రేమకు... మోహానికి తేడా తెలియడం లేదు...! అలాంటి వాడి మీద మీలాంటి బంగారాలు ఉమ్మి కూడా ఉయ్యకూడదు!! ‘ఎందుకు సార్....!?!’ దాన్ని వాడు ఎంగిలి అనుకుంటాడు రాస్కెల్!! ‘సార్... కూల్ డౌన్.. కూల్ డౌన్..! ఇదిగో అరటిపండు!!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com