
నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. కానీ నన్ను నా మరదలు చాలా లవ్ చేస్తోంది. నేను లవ్ చేస్తున్న అమ్మాయికి నేనంటే ఇష్టమో కాదో తెలీదు సర్. కానీ నా మరదలికి నేనంటే చాలా ప్రేమ. ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటారు సార్? – నాగబాబు
నాగబాబు నువ్వు చాలా సెల్ఫిష్...‘ఏంటి సార్, అంత మాట అనేశారు?’ఇక్కడ అబ్బాయిలు ఒక్క లవ్ కోసం కిలోమీటర్ లైన్లో నిలబడి ఉంటే...‘మరదలు ప్రేమిస్తుంది కాబట్టి... తను లవ్ చేసిన అమ్మాయిని వదులుకోవాలా సార్?’వదిలెయ్యకపోతే బెటర్...‘మరి పాపం మరదలు?’అదృష్టవంతురాలు..‘సార్!!!’మరదలికి మినపట్టు కావాలి..‘మరి బావకు!?!’పిజ్జా కావాలి.‘అడ్జెస్ట్‌మెంట్ కుదరదా సార్?’అడ్జస్ట్ అయితే మరదలి లైఫ్ పాడైపోతుంది.
తనంటే ఇష్టం లేని బావను పెళ్లి చేసుకునే బదులు...‘బదులు...?’జీవితాంతం లవ్‌లో ఉండే బావను చూసుకోవడం బెటర్..‘జీవితాంతం లవ్‌లో? అంటే... బావ లవ్వు వర్కౌట్ కాదా సార్? ఎప్పుడూ లవ్వే కానీ.. పెళ్లి కాదా సార్?’నాగబాబుకు జీవితాంతం లవ్లో ఉండడమే ఇష్టం నీలూ.. ట్రై.. ట్రై అండ్ సక్సీడ్...‘మరి మరదలు సార్???’లక్కీ గర్ల్... తాను ఇష్టపడినవాడి కంటే తనని ఇష్టపడేవాడు వస్తాడు. లక్కీ గర్ల్..!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com