నన్నడగొద్దు ప్లీజ్‌ 

love doctor solve the problems - Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నయ్యా..! నేనొక అబ్బాయిని లవ్‌ చేశాను. ఇంటర్‌ నుంచి మేము క్లాస్‌మేట్స్‌. నేను ఎప్పుడూ క్లాస్‌ టాపర్‌ని. డిగ్రీ కూడా ఇద్దరం కలిసి చదివాం. డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌లో తనే వచ్చి ప్రపోజ్‌ చేశాడు. కొన్ని రోజుల తర్వాత నేను ఓకే చెప్పాను. టూ ఇయర్స్‌ బాగానే ఉన్నాం. నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం. నన్ను మా డాడీ ఎలా చూసుకుంటారో... తను కూడా నన్ను అలానే చూసుకునేవాడు. డిగ్రీ పూర్తయ్యాక నేను బ్యాంక్‌ కోచింగ్‌ కోసం గుంటూర్‌ వెళ్లాను. అప్పటి నుంచి తను నన్ను అవాయిడ్‌ చేయడం మొదలుపెట్టాడు. ఎందుకని అడిగితే సరిగా సమాధానం కూడా చెప్పడం లేదు. నన్ను దూరం పెడుతున్నాడు. దాంతో నేను చదువుపై దృష్టిపెట్టలేకపోతున్నా. నేను జాబ్‌ తెచ్చుకుని, మా పేరెంట్స్‌ని బాగా చూసుకోవాలని అనుకుంటున్నా. తన ఆలోచనల నుంచి ఎలా బయటపడాలి అన్నయ్యా? తన కారణంగా నా ఫ్యూచర్‌ స్పాయిల్‌ అయిపోతోంది. ప్లీజ్‌ సలహా ఇవ్వండి. – నూర్‌
నువ్వు మా నూర్‌ తల్లి...!‘నూర్‌ అంటే ఏంటి సార్‌..?’వెలుగులాగా అని...‘అంటే మీ బంగారు నూర్‌ ఉంటే వెలుతురు ఉంటుందా సార్‌?’బ్రైట్‌నెస్‌ ఒకటే కాదు, స్మార్ట్‌నెస్‌ కూడా ఉంటుంది.‘అంటే చదువుల్లో స్మార్ట్‌నెస్‌ లాగా సార్‌?’పర్ఫెక్ట్‌గా చెప్పావు నీలాంబరి. నా బంగారం సూపర్‌ స్మార్ట్‌ గర్ల్‌...!‘మరి ఎందుకు సార్‌ అంత బాధలో ఉంది?’మేఘం అడ్డం వచ్చింది నీలాంబరి.‘అబ్బాయి వెలుగును కప్పేస్తున్నాడా సార్‌?’బ్యాడ్‌ బాయ్స్‌ అంతే నీలూ!‘కానీ సమ్మర్‌లో మేఘం లేకపోతే నీడ ఉండదు కదా సార్‌?

’అలాంటి నీడ కంటే.. గొడుగు వాడుకుంటే బెటర్‌.. మనకు కావల్సినప్పుడు ఓపెన్‌ అవుతుంది. వద్దనుకుంటే క్లోజ్‌ చేసెయొచ్చు.‘అబ్బా!! భలే చెప్పారు సార్‌... మరి క్లౌడ్స్‌ లేకపోతే వానా!?!’ఇలాంటి బ్యాడ్‌ బాయ్స్‌ ఓటి కుండల్లాంటి మేఘాలు నీలూ.. గాల్లో తేలుతూ ఉంటాయి. ఒక్క చుక్క ప్రేమ ఉండదు. ఎంప్టీ క్లౌడ్స్‌... ‘అవును సార్‌... నూర్‌కు అడ్డం పడ్డ మేఘం ఎంప్టీ ఫెలో! ఈజీగా మరచిపోవచ్చు.’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్,  రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top