
హాయ్ సార్..! నేనొక అమ్మాయిని నాలుగేళ్లుగా లవ్ చేస్తున్నా. నేను లవ్ చేస్తున్న విషయం ఆ అమ్మాయికి కూడా తెలుసు. ఒకసారి చూసీచూడనట్లుగా నన్ను చూసి వెళ్లిపోయింది. ఆ తర్వాత ‘నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు. నన్ను ఫాలో చెయ్యకు, అర్థం చేసుకో’’ అని మెసేజ్ చేసింది. కానీ ఆమెను చూడకుండా నేను ఉండలేకపోతున్నా. ప్రతిరోజు ఆమెని చూడాలనిపిస్తోంది. ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి. – అంజన్
ఫాలో.. ఫాలో.. ఫాలో...‘..అవ్వడానికి మనమేమైనా జూనియర్ ఎన్టీఆర్‌మా అని క్లాస్ పీకుతున్నారా సార్?’జీవితంలో ఫాలో అవ్వాల్సినవి....‘..అమ్మాయిల కంటే గ్రేట్వి వేరే ఉన్నాయని క్లాస్ పీకబోతున్నారా సార్?’అసలు ఫాలో అంటే...‘..ఇంకొకరి వెనకాల పడటం తప్ప ముందు ఉండడం కాదని క్లాస్ పీకుతున్నారా సార్?’ఫాలో అవ్వడానికి...‘..ఏదైనా వర్త్ గోల్ పెట్టుకోవాలని క్లాస్ పీకబోతున్నారా సార్?’అసలు ఫాలో అన్నది...‘..చాలా హౌలాపని అని క్లాస్ పీకుతున్నారా సార్?’ఎఫ్..ఓ..ఎల్..ఎల్...ఓ...డబ్ల్యూ.....‘..ఆరు అక్షరాల ఊబి అని క్లాస్ పీకబోతున్నారా సార్?’ఫాలో కంటే.....‘..కంటే... కంటే...’ఇష్టం లేని వాళ్ల వెనకాలపడే బదులు...‘అర్థమైంది సార్...! ఫాలో కంటే సోలోనే బెటర్... ఓ బ్రదర్...!’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com