
హాయ్ అన్నయ్యా..! నేను డ్రైవింగ్ చేస్తుంటా. నాకు నా మరదలంటే చాలా ఇష్టం. తను మాత్రం ‘‘మా మమ్మీ ఎవరిని చేసుకోమంటే వాళ్లనే చేసుకుంటా’’ అని చెప్పింది. కానీ తను లేకపోతే చచ్చిపోవాలనిపిస్తోంది. నిద్ర పట్టడంలేదు. చాలా భయంగా అనిపిస్తోంది. తట్టుకోలేకపోతున్నా. ఇన్ని రోజులు నాతో చాట్ చేసేది. బట్ ఇప్పుడు అది కూడా మానేసింది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. తనే గుర్తుకొస్తోంది. ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి అన్నయ్యా. – జగదీశ్
సిగ్నల్ రెడ్ ఉందన్నా...అది గ్రీన్‌గా మారాలని అనుకుంటున్నావు...!‘సార్ ఏ సిగ్నల్ అయినా రెడ్ నుంచి గ్రీన్‌కి మారుతుంది కదా సార్???’సిగ్నల్ రెడ్ ఉందన్నా...‘చెప్పిందే చెబుతారేంటి సార్?????’అది గ్రీన్‌గా మారాలని అనుకుంటున్నావు...‘సార్ మీరు అరిగిపోయిన రికార్డులా అక్కడే తిరుగుతూ ఉంటారా? ముందుకేమైనా వెళ్తారా???’ఎలా వెళ్లాలి? సిగ్నల్ రెడ్ ఉంది కదా???‘మీకు ఉత్తరాలు రాసేవాళ్లు మీ రెడ్ సిగ్నల్ చూసి రాయడం మానేస్తారు.. జగదీశ్‌కి ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి సార్!’గుండె సిగ్నల్ గ్రీన్ ఉంది. అందుకే జగదీశ్ ప్రతి క్షణం తన గురించే ఆలోచిస్తున్నాడు. కానీ అమ్మాయి మనసులో రెడ్ పడింది. మనకు కావల్సినట్టు డ్రైవ్ చెయ్యడానికి ఇది హైవే కాదు. కష్టమైన, ఇరుకైన బిజీ ట్రాఫిక్...!‘అంటే అమ్మాయి అక్కడెక్కడో ఉంది. జగదీశ్ ట్రాఫిక్ జామ్‌లో ఉన్నాడా సార్???’ఎగ్జాట్లీ నీలాంబరీ...! జీవితం.. ప్రేమ.. ఖాళీ రోడ్లు కావు. ఎన్నో బండ్లు, ఎన్నో రకాలు.. ఒక్కోసారి అనుకున్న టైమ్‌కి చేరలేము. ఒక్కోసారి రూట్ మార్చుకుంటాము.. ఒక్కోసారి....‘గమ్యమే మారిపోతుంది కదా సార్!.. ఎంత పొయిటిక్‌గా చెప్పారు సార్...!’రోడ్డు ఏదైనా.. సిగ్నల్ ఏదైనా స్టీరింగ్ మనదన్నా... తిప్పు. గిర్రున తిప్పు..! కొత్త బాట పట్టన్నా..! లవ్ యు జగదీశ్...!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com