
హాయ్ సార్...! నేను డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. నేను మా మావయ్య కూతుర్ని లవ్ చేస్తున్నాను. బట్ మా మావయ్య నన్ను జాబ్ తెచ్చుకోమన్నాడు. కానీ నేను చదువులో చాలా వీక్. నా మరదలు నన్ను లవ్ చేస్తుందో లేదో తెలియడం లేదు. కానీ నాతో బాగా మాట్లాడుతుంది. ప్లీజ్ దీనికి మంచి సలహా చెప్పండి. – కృష్ణ
చదువుకో తమ్ముడూ చదువుకో...! ‘స్టడీస్‌లో వీక్ అంటున్నాడు కదా సార్?’ కష్టపడి చదువుకోవాలి నీలాంబరి. ‘మీరేదో ప్రేమ పాఠాలు వల్లిస్తారని... ఆశగా ఉత్తరం రాస్తే... మీరేంటి సార్ చదువుకోమంటున్నారు!?!’ చదువుకుంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే విషయం అర్థమవుతుంది. విషయం అర్థమైతే.... మరదలిది ప్రేమో..? ఏమో..?........... ‘అర్థమౌతుంది కదా సార్!’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com