
హాయ్ అన్నయ్యా..! ఇది సెకండ్ టైమ్ నేను మీతో మాట్లాడ్డం. ఫస్ట్ టైమ్ మీకు నా ప్రాబ్లమ్ చెప్పినప్పుడు ‘‘వాణ్ని వదిలెయ్.. బయటకి ఊసెయ్’’ అన్నారు. అలానే చేశా అన్నయ్యా. వాడినైతే మరిచిపోయా కానీ, వాడి జ్ఞాపకాలను మరిచిపోలేకపోతున్నా. ఫ్రెండ్స్ అనే ప్రపంచంలో పడ్డాను. బట్ ఏదో బాధ నన్ను వెంటాడుతోంది. మనసుని ఎంత డైవర్ట్ చేసుకున్నా.. మళ్లీ ఆ బాధ దగ్గరకే వస్తున్నా. నా పేరెంట్స్ నన్ను సంతోషంగా ఉంచాలని చాలా కష్టపడుతున్నారు. నా కళ్లల్లో నీళ్లు చూస్తే వాళ్లు ఏమైపోతారోనని ఏడవడం కూడా మానేశా. కానీ గుండె బరువుగా ఉందన్నయ్యా. అన్నీ షేర్ చేసుకునే ఫ్రెండ్స్ దగ్గర కూడా ఏడుపు రావడంలేదు. వాళ్ల ముందు కూడా నటిస్తున్నా. నేను నాలాగా ఎవరి దగ్గరా ఉండలేకపోతున్నా. అసలు ఈ బాధకు కారణం ఏమిటో నాకే అర్థం కానప్పుడు, ఏమని చెప్పి ఏడ్వాలి? కానీ నా అనే వాళ్లని పట్టుకుని బాధపోయేదాకా ఏడ్వాలనుంది. నా పేరు హస్మ అన్నయ్యా. గుర్తున్నానా? మీ లక్షల మంది చెల్లెళ్లలో నేనూ ఒకదాన్ని. నా లైఫ్‌కి ఏదైనా సలహా ఇవ్వండి ప్లీజ్.
– హస్మ
హస్మ బంగారం... ఒక్క క్షణం కూడా బాధను ఆపకు... మనస్పూర్తిగా ఏడ్చేసెయ్... వాడ్ని ఊసేసావు.. వాడి ఊసులను కన్నీళ్లతో కడిగేసెయ్... చెప్పడం చాలా ఈజీ.. చెయ్యడం చాలా కష్టమని నాకు తెలుసు. అలా అని లైఫ్‌ని ఒక దుర్మార్గుడి కోసం... మనమే పాడు చేసుకోవడం వల్ల... వాడి పన్నాగం పండినట్టే...! పెద్ద హీరో అనుకుంటున్నాడు గాడిద. వాడు నిన్ను మోసం చెయ్యడం దుర్మార్గమైతే...ఇవాళ నిన్ను నువ్వు మోసం చేసుకోవడం సిల్లీ..! ప్రేమలో పడ్డావు, మోసపోయావు. రెండూ సహజంగా జరిగాయి. అక్కడితో ఆపు. లేకపోతే పిరికిదానిలా జీవిస్తావు. ఏడ్చెయ్..! బాధను కడిగెయ్..!! ముందుకు అడుగెయ్..!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com