
హాయ్ అన్నయ్యా..! నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. కొన్ని నెలల్లో పెళ్లి కూడా చేసుకుందామనుకుంటున్నాం. కానీ చాలా భయమేస్తోంది. ఎందుకంటే తను నాకంటే ముందు ఒక అమ్మాయిని లవ్ చేశాడు. బట్ ఆ అమ్మాయికి వేరే పెళ్లై వెళ్లిపోయిందట. ఆ విషయం తెలిసి కూడా నేను తనని ఇష్టపడ్డాను. తను హ్యాపీగా ఉండాలని నేను తనకి అన్ని విషయాల్లో చాలా సపోర్ట్ ఇస్తాను. కానీ ఎందుకో తను నాతో అసలు ప్రేమగా ఉండడు. నేనంటే ఇష్టమని అందరికీ చెబుతాడు కానీ, అసలు ప్రేమ చూపించడు. మారతాడని త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. కానీ ఎలాంటి మార్పు రాలేదు. నువ్వు ఇలానే ఉంటే నాకు చాలా కష్టంగా ఉంటుందని తనతో చెప్పాను. ‘‘నేనింతే ఇలానే ఉంటాను. ఇష్టమైతే ఉండు, లేదంటే పో...’’ అన్నాడు. ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసి మరీ ఈ పెళ్లికి సిద్ధమయ్యాను. కానీ పెళ్లి తరువాత కూడా తను ఇలానే ప్రవర్తిస్తే..? అనే ఆలోచన నన్ను బాగా భయపెడుతోంది. ఇలానే జీవితాంతం బాధపడుతూ ఉండాలంటే భయమేస్తో్తంది. ఇప్పటికే చాలా ఫేస్ చేశాను అన్నయ్యా. తన మాటలను ఇంకా భరించే ఓపిక, సహనం రెండూ నాకు లేవు. అలా అని తన నుంచి దూరంగా ఉండలేను. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడంలేదు. – సంధ్య
ఇగో.. ఇగో.. ఇగో.... ప్రేమలో ఉండకూడనిది ఇగో.. ప్రేమలో స్వార్థం ఉండదు.. ప్రేమలో ‘నేను’ ఉండరాదు.. ప్రేమలో పట్టింపులు పనికిరావు... ప్రేమలో ఒకరికి గెలుపు ఇంకొకరికి ఓటమి ఉండదు.. ఇద్దరూ గెలవాలి. ఈ అబ్బాయిని చేసుకుంటే లైఫ్ అంతా సఫర్ అవుతావు.. బూజు దులిపేసుకో... మనసంతా పట్టిన వాడి బూజు దులిపేసుకో... నువ్వు పడుతున్నావు కాబట్టి.. పోజులు కొడుతున్నాడు..
అసలు వాడికి ప్రేమంటే ఏంటో తెలియదు.. ఒట్టి సెల్ఫిష్ ఇడియట్.. మొదటి అమ్మాయి అందుకే వాణ్ని తన్ని తగలేసింది.. నీకు దండం పెడతా సంధ్యా.... ఇమీడియట్‌గా బూజు దులిపేసుకో... ‘అవును సార్.. ఒట్టి సెల్ఫ్‌గాడు.. పెళ్లి చేసుకుంటే నరకమే.. సార్.. ఈసారి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు సార్...!’ అదేంటి నీలాంబరీ అబ్బాయిని తిట్టినా నన్ను సమర్థిస్తున్నావు? ‘అబ్బాయిని అంటే నాకు కోపం వస్తుంది సార్.. కానీ హీ ఈజ్ నాట్ అబ్బాయి.. హీ ఈజ్ గబ్బాయి..’ అంటే గబ్బు మనిషేనా? ‘ఎస్.. అప్పుడప్పుడు మీరు స్మార్ట్‌గా ఉంటారు సార్.. ఇంద అరటిపండు!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com