నన్నడగొద్దు ప్లీజ్‌  | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

Published Tue, Jan 30 2018 12:42 AM

love doctor solve the problems - Sakshi

హలో అన్నయ్యా.. నేను బీటెక్‌ ఫస్ట్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్‌ చేశాను. మొదట్లో మేం బెస్ట్‌ ఫ్రెండ్స్‌. చాలా క్లోజ్‌ అయ్యాం. వదిలి ఉండలేని పరిస్థితికి వచ్చాక... ‘‘వేరే అమ్మాయితో పెళ్లి ఫిక్స్‌ అయ్యింది, తనంటే నాకు ఇష్టంలేదు. కానీ చేసుకోకపోతే మా నాన్న చచ్చిపోతాడు’’ అని చెప్పాడు. ఒకసారి నేను ఆ అమ్మాయితో మాట్లాడాను. మేం లవ్‌ చేసుకుంటున్నామని కూడా చెప్పాను. కానీ తన నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఈ ఇయర్‌లో పెళ్లి అవొచ్చు అంటున్నాడు. అయినా సరే నాతోనే ఉంటున్నాడు. మరిపోవాలని ట్రై చేస్తున్నా కానీ ప్రతిసారీ ఫెయిల్‌ అవుతున్నా. వాడికి ఎక్కడ పెళ్లి అయిపోతుందోనని చాలా భయపడుతున్నా. నిద్రాహారాలు లేకుండా నిత్యం ఏడుస్తున్నా. ప్లీజ్‌ మంచి సలహా ఇవ్వండి అన్నయ్యా. – కావ్య
కావ్యా బంగారం...!నీ పేరులా... జీవితం అంత అందమైన కావ్యం కాదురా!అపశృతులు ఎక్కువ.ప్రేమ సరైన వాడితో చెయ్యకపోతే..లైఫ్‌ అంతా అపశృతే..!కొలనులోని అందమైన కమలం చుట్టూ బురదే ఉంటుంది నాన్నా.తామరాకులా ఉండడం నేర్చుకోవాలి.‘సార్‌ తామరాకులా అంటే ఎలా సార్‌??’బురద చుక్కలు పడ్డా..తామరాకు అందం మారదు..తామరాకు ఆలోచనా మారదు...ఎందుకంటే తామరాకుకు తెలుసు..తాను స్వచ్ఛమైనదని.మంచీచెడు తనను కెరటంలా ఎగరనివ్వదని, పడనివ్వదని.

‘అంటే ఇప్పుడు ఆ అబ్బాయి ప్రేమ పన్నీరా? బురద చుక్కా? సార్‌????’ప్రేమించిన వాడిలో పవిత్రత ఉంటే నాన్న కొడతాడనో..అమ్మ కోప్పడుతుందనో అమ్మాయికి అన్యాయం చెయ్యడు.అమ్మానాన్నల మీద అంత గౌరవం ఉంటే.. అమ్మాయిని తప్పుదారి పట్టించాల్సింది కాదు.ఆ అబ్బాయికి, తన ఫియాన్సీకి కావ్య అంటే చాలా చిన్న చూపు ఉంటుంది.అలాంటి చోట.. అలాంటి మనుషుల మధ్య నా బంగారం....‘ఒక్క క్షణం కూడా ఉండకూడదు సార్‌... ఉండకూడదు అంతే..!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

ప్రేమ, ఆకర్షణ, టీనేజ్‌ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్‌ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, 
బంజారాహిల్స్, హైదరాబాద్‌–34.lovedoctorram@sakshi.com

Advertisement
Advertisement