
హాయ్ బ్రో.. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయి చాలా మంచిది. ఎంత మంచిదంటే ఇంట్లో వాళ్లు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాడినే చేసుకునేంత మంచిది. తను ట్వంటీ ఫోర్ కేరెట్స్ గోల్డ్. అలాంటి అమ్మాయిని నేను డీప్‌గా లవ్ చేస్తున్నా. వన్ డే ప్రపోజ్ చేశా. ‘‘నాకు ఇష్టంలేదు’’ అంది. చాలా సార్లు రిప్లై అడిగాను. ‘‘నో’’ అంది. నా ఫ్రెండ్స్ కూడా చెప్పి చూశారు. నో యూజ్. ఎవరితోనైనా బాగా మాట్లాడుద్ది. షీ ఈజ్ సో నైస్. నేను వాళ్ల డాడ్‌తో మాట్లాడితే తనకు బ్యాడ్ నేమ్ వస్తుందని ఆలోచించి చెప్పలేదు. పైగా మా నేపథ్యాలు కూడా వేరు. ఒప్పుకోరు అనిపిస్తోంది. తనకి వన్ మంత్‌లోనే పెళ్లంట. నాకు చాలా బాధగా ఉంది. తనని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నా. తనని తప్ప ఇంకెవరినీ ప్రేమించలేను. తననే పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ తనకి పెళ్లి ఫిక్స్ అయ్యింది. తను లేకపోతే చచ్చిపోవాలని ఉంది. తను నాకు కావాలి. సలహా ఇవ్వండి ప్లీజ్ – సురేందర్
అన్నా నీకు దండం పెడతా! ఎట్లా అన్నా? ఇట్లా అయితే? అమ్మాయి అన్నా! ఏమయినా వస్తువా? నాకు కావాలి అంటే తెచ్చిపెట్టడానికి..? ప్లీజ్ అండర్‌స్టాండ్ అన్నా..! అమ్మాయేమో గుణవతి.. సుశీలవతి.. సత్యవతి! అచ్చి.. కుచ్చి మాటలు మాట్లాడితే.. కుదరదు! నేను డాడీ కూచి!! అని చెబుతుంది. కొన్ని వర్కౌట్ కావు అన్నా.. అర్థం చేసుకో..! నా అత్త కూతురయితే వెళ్లి మాట్లాడి కన్విన్స్ చేసేవాడిని..! నీ కోసం ఎమైనా చేసేవాడిని..! కానీ గుణవతి.. సుశీలవతి.. సత్యవతి.. డాడీప్రీతి ఉన్న అమ్మాయిని తెమ్మంటే తల ఎక్కడ కొట్టుకోవాలన్నా? నీకు దండం పెడతా డాడీ మాట కాకుండా నీ మాట వినే గర్ల్ ఫ్రెండ్‌ని చూసి చేసుకో..!!
‘ఏంటి సార్ అబ్బాయిలకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదనుకుంటున్నారా? ఒక అమ్మాయి నో చెబితే ఇంకో అమ్మాయి కోసం వెంపర్లాడటానికి..? వాట్ ఆర్ యు థింకింగ్ ఆఫ్ బాయ్స్ సార్?? సురేందర్‌కి ఏమి సార్.. గర్ల్స్ లైన్ కడతారు. ఏదో మిమ్మల్ని ప్రేమకు పెద్ద దిక్కుగా భావించి ఒక మాట రికమండేషన్ చెబుతారేమో అని అడిగాడు. సెల్ఫ్‌వర్త్ ఉన్న వాడు. మీరు అరటిపండు తినండి. సురేంద్ర నేనిచ్చిన కాన్ఫిడెన్స్‌తో రెచ్చిపోయి లైఫ్‌లో సూపర్ డూపర్ హిట్ కొడతాడు..!’ ఓకే.. ఓకే.. ఓకే.. సురేందర్.. డోన్ట్ సరెండర్!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34.lovedoctorram@sakshi.com