
హాయ్ అన్నయ్యా! నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. ఈ మధ్యే నాకు పెళ్లి ఫిక్స్ చేశారు. నా లవ్ విషయం తెలిసి అది క్యాన్సిల్ అయిపోయింది. దాంతో మా వాళ్లందరికీ మా విషయం తెలిసిపోయింది. ఇక వాళ్ల డాడీకి మా విషయం తెలియక తన మరదలితో పెళ్లి చెయ్యాలనుకుంటున్నారు. వాళ్ల అమ్మకు మా ప్రేమ విషయం తెలుసు. ఇదంతా చూసి నాకు భయం వేసి.. ఏం చేద్దాం? నాకు భయంగా ఉంది..! అని తనని అడిగితే.. ‘‘నువ్వు భయపడకు, నేను నిన్ను తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోను. కెరీర్ గురించి ఆలోచించు, నాకు ఫైవ్ ఇయర్స్ టైమ్ ఇవ్వు. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండు చాలు. నిన్ను ఎలా చూసుకోవాలనుకున్నానో అంతకన్నా ఎక్కువగా చూసుకుంటా!’’ అని మాట ఇచ్చాడు. నేను తనని పూర్తిగా నమ్ముతున్నాను. కానీ ప్రాబ్లమేంటంటే మా ఇంట్లో వాళ్లు.. మా నేపథ్యాలు వేరు కావడంతో కాదంటున్నారు. తన కోసం ఫైవ్ ఇయర్స్ కాకపోతే, ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాను. తనకి నేనంటే ప్రాణం. వాళ్ల అమ్మతో సమానంగా నన్ను చూసుకుంటాడు. ఒకరినొకరం వదులుకోలేం. ప్లీజ్ అన్నయ్యా సలహా ఇవ్వండి. – అక్షిత
వద్దనుకోవడానికి.. వదిలేసుకోవడానికి.. కారణాలేవీ కనబడటంలేదు చాంపియన్! ‘సార్ ఈ కొత్త ప్రేమ ఏంటి సార్.. చెల్లెలి మీద..?? చాంపియన్ అంటున్నారు..?!!?’ ఎవ్రీ గర్ల్ ఈజ్ ఏ చాంపియన్..! సూపర్ చాంపియన్!! ‘అబ్బాయి మోసం చేస్తాడనిపించడం లేదు సార్..!?’ మోసం చెయ్యకపోయినా చాంపియన్ లాగా ఆలోచించాలి. ‘అంటే అమ్మాయి అబ్బాయిని మోసం చెయ్యాలా సార్..? ఈజ్ దట్ వాట్ యు ఆర్ సేయింగ్ సార్??’ చాంపియన్‌లు మోసపోరు..! దేనికయినా భయపడకుండా ఉంటారు..!! ‘అంటే అబ్బాయి మోసం చేస్తాడని భయమా సార్??’
అబ్బాయి మోసం చెయ్యకపోయినా... పిరికి వాడయితే.. ‘ప్రేమ ఉండి కూడా తోక ముడుస్తాడు...!
డాడీ కొడతాడని చిన్న పిల్లాడిలా ఏడుస్తాడు కదా సార్??’ అబ్బాయి ధైర్యం మీద ఆధారపడి.. పిరికితనానికి ఒరిగిపోయి.. జీవించడం చాంపియన్ లైఫ్ కాదు! ‘మరి ఏమి చెయ్యాలి సార్??’ అబ్బాయి ప్రేమిస్తున్నాడన్న ఆనందాన్ని గుండెల్లో నింపుకుని.. తన ప్రేమ అంతే గొప్పదని గుర్తించి.. తన సత్తా ఏంటో కెరీర్లో చూపించి.. తన కాళ్లమీద తాను నిలబడి.. జీవితాన్ని, ప్రేమను శాసించాలి మై చాంపియన్!!ఇప్పటికే పెళ్లి ఫిక్స్ అయ్యి క్యాన్సిల్ అయిన బాధ ఫ్యామిలీ వాళ్లకి ఉంటుంది. సమాజం కూడా ఇబ్బందిగా చూస్తుంది. అలాంటప్పుడు మన సత్తా ఏంటో మన చాంపియన్ చూపించాలి కదా నీలూ!?‘భలే చెప్పారు సార్.. నేనే చాంపియన్‌లా ఫీల్ అయిపోతున్నాను. షూర్‌గా ఆడపిల్లలందరూ చాంపియన్‌లే సార్!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com