నన్నడగొద్దు ప్లీజ్‌

 love doctor sokve the problems

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ అన్నయ్యా..! నేను ఒక అబ్బాయిని లవ్‌ చేశాను. అతనికి నేనంటే ప్రాణం. అతను డాక్టర్‌. తనకి ఓౌఛిజి’టఉంది అన్నయ్యా. ‘సో మనం విడిపోదాం మీ పేరెంట్స్‌ చూసిన వాళ్లని పెళ్లి చేసుకో’ అంటున్నాడు. ‘ట్రీట్‌మెంట్‌ ఉంటుంది కదా’ అన్నా వినడం లేదు. నాతో మాట్లాడటం మానేశాడు. నాకు చాలా బాధగా ఉందన్నయ్యా. చచ్చిపోవాలనిపిస్తోంది. కానీ మా పేరెంట్స్‌ గురించి ఆలోచించి ఆగిపోతున్నా. మీరైనా చెప్పండి అన్నయ్యా ఆ అబ్బాయికి... నన్ను వదిలెయ్యొద్దని! ప్లీజ్‌ అన్నయ్యా...!!- సౌందర్య

‘సార్‌.. జుౌఛిజి’టఅంటే ఏంటి సార్‌?’ టీబీ లాంటిది! ‘ఏమి మాయరోగం సార్‌ అంత గమ్మత్తయిన పేరు..!’ మాయరోగమే!! ‘అంటే ట్రీట్‌మెంట్‌ ఇస్తే తగ్గదా సార్‌?’ చాలా ఈజీగా తగ్గిపోద్ది!! ‘మరి.. ఏంటి సార్‌!?’ మాయరోగం కదా!! ‘సార్‌ కన్ఫ్యూజ్‌ చేస్తున్నారు సార్‌!!’ ఏంటి కన్ఫ్యూజన్‌? ‘ఈజీగా తగ్గుద్ది అంటున్నారు.. మరి మాయరోగం అంటున్నారు?’ మాయరోగం అబ్బాయికి..!! ‘సార్‌.. సార్‌.. సార్‌....!!’ నీకేం మాయరోగం వచ్చింది నీలాంబరీ..!? ‘అబ్బాయికి టీబీ తగ్గుద్ది అని, మళ్లీ మాయరోగం అంటే పిచ్చెక్కదా సార్‌?’ అదికాదు నీలాంబరీ.. అబ్బాయి డాక్టర్‌ కదా...! ‘అవును సార్‌’ మనం డాక్టర్‌ కాదు కదా? ‘ష్‌... ష్‌.. ష్‌.. మెల్లగా చెప్పండి సార్‌.. ఎవరయినా వింటారు.. దుకాణం బంద్‌ అయిపోతుంది సార్‌!’ డాక్టర్‌ కాని మనకే ఓౌఛిజి’టజబ్బు నయమయిపోతుంది అని తెలిస్తే డాక్టర్‌కి తెలియకుండా ఉంటుందా నీలూ..? ‘తప్పకుండా తెలుస్తుంది సార్‌!?’ మరందుకే డాక్టర్‌కి మాయరోగం అని చెప్తున్నా...! మీకు దండం పెడతా కాస్త సౌందర్యకి అర్థమయ్యేలా చెప్పండి సార్‌!!’ డాక్టర్‌కి ఇంట్రెస్ట్‌ లేదు.. సౌందర్య అర్థం చేసుకోవాలి.. ఎమోషనల్‌గా ఫీల్‌ అవకుండా మోసాన్ని అర్థం చేసుకోవాలి. లక్కీగా ముందే తెలిసిపోయింది. లేకపోతే ఎంతో నష్టం జరిగేది! ‘సార్‌ నిజంగా ఫైనల్‌ స్టేజ్‌లో ఉందేమో జబ్బు!?!’ అప్పుడు డాక్టర్‌ రిపోర్ట్స్‌ సౌందర్యకు చూపించాలి!!

నోట్‌ : ట్యూబర్క్యులోసిస్‌ (టీబీ)ను వైద్య పరిభాషలో ‘కాక్స్‌’ అని వ్యవహరిస్తారు. అందరికీ అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే కాక్స్‌లో ప్రధానంగా మూడు రకాలుంటాయి. మొదటిది పల్మునరీ కాక్స్‌. ఇది ఊపిరితిత్తులకు వచ్చేది. చికిత్సతో పూర్తిగా తగ్గుతుంది. రెండోది ఊపిరితిత్తులకు కాకుండా ఒంట్లో మరే అవయవానికైనా వచ్చేది. ఇది కూడా పూర్తిగా తగ్గుతుంది. ఇక మూడోది మందులకు లొంగని (మల్టీ డ్రగ్‌ థెరపీకి సైతం రెసిస్టెన్స్‌ కలిగి ఉన్న) కాక్స్‌. ఈ కాక్స్‌ తగ్గడానికి కూడా 50 శాతం అవకాశం ఉంది. ఇది మినహాయిస్తే మిగతా రకాల కాక్స్‌ వచ్చిన వారు నిరభ్యంతరంగా పెళ్లిళ్లు చేసుకోవచ్చు. పిల్లలనూ కనవచ్చు.
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌

లవ్‌ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ,  సాక్షి టవర్స్, రోడ్‌ నంబరు 1, బంజారాహిల్స్,  హైదరాబాద్‌–34. lovedoctorram@sakshi.com

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top