నన్నడగొద్దు ప్లీజ్‌ 

Love doctor returns 01-04-2019 - Sakshi

లవ్‌ డాక్టర్‌

హాయ్‌ సార్‌! నేను మీ లవ్‌ డాక్టర్‌ కాలమ్‌ ప్రతిరోజూ చదువుతాను. నాకొక సమస్య వచ్చింది సార్‌. నేను నా మేనమామ కూతురిని ప్రేమించాను. తనూ నన్ను ప్రేమించింది. అలా మూడు సంవత్సరాలు బాగానే ఉన్నాం. సడెన్‌గా తన నుంచి ఫోన్‌ లేదు, మెసేజ్‌ లేదు. చాలా కాలం బాధపడ్డాను. తర్వాత తను వేరే అతడిని ప్రేమిస్తోందని తెలిసింది. వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పాను. ‘సారీ బావా.. నేను ఇంకెప్పుడూ ఇలా చెయ్యను, నిన్నే పెళ్లి చేసుకుంటాను’ అంది. దాంతో నేను ‘సరే మారుతుందిలే.. పెళ్లి చేసుకుందాం’ అనుకున్నాను. కానీ మళ్ళీ ఫోన్, మెసేజ్‌ ఏమీ చెయ్యట్లేదు. అలాగని ఇంట్లో ఏమైనా సమస్యా అంటే అది కూడా లేదు. వాళ్ళ అమ్మ వాళ్ళకి కూడా నేను చాలా ఇష్టమే. అసలు ఈ అమ్మాయిని నమ్మొచ్చో లేదో అర్థం కావడం లేదు. మంచి సలహా ఇవ్వండి సార్‌ ప్లీజ్‌. – రవి
‘రవీ.. ఈ లవ్‌ డాక్టర్‌ని ఆ ఒక్కటీ అడగొద్దు!!నువ్వు ఎన్నిసార్లు అడిగినా...ఎన్ని రకాలుగా అడిగినా...ఏమార్చి అడిగినా...బతిమాలీ బామాలీ అడిగినా...కాళ్లూ గడ్డం పట్టుకుని అడిగినా...మీసం ముట్టుకుని అడిగినా...నో.. అనే చెబుతారు!!మేనరికాలు.. ససేమిరా అంటారు.మీకు పుట్టబోయే పిల్లలు అవిటివాళ్లు అయ్యే చాన్స్‌ ఉందని రివర్స్‌లో మిమ్మల్నే కాళ్లూ గడ్డం పట్టుకుని బతిమాలి.. బామాలి.. నీకు మీసం ఉంటే.. రోషం ఉంటే వద్దని అడుక్కుంటారు.. అందుకే ఇంకో లవ్‌ డాక్టర్‌ ఎవరైనా ఉన్నారేమో అడుక్కోవడం బెటర్‌!!’
ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌
lovedoctorram@sakshi.com

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top