నన్నడగొద్దు ప్లీజ్‌

Love doctor Priyadarshini Rams' advices - Sakshi

హాయ్‌ సార్‌..! నేనొక అమ్మాయిని లవ్‌ చేస్తున్నాను. నేనంటే ఆ అమ్మాయికి ఇష్టముందో లేదో తెలుసుకోవడం ఎలా? ఆ అమ్మాయి పేరు మహాలక్ష్మి. మేము డిగ్రీ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నాం. నేను చూసినప్పుడల్లా నన్ను తనూ చూస్తోంది. అసలు ఆ అమ్మాయికి నా మీద ఇంట్రెస్ట్‌ ఉందా? లవ్‌ ప్రపోజ్‌ చేస్తే ఓకే చేస్తుందా? లేక ఫ్రెండ్‌షిప్‌ చెయ్యాలా? ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. అసలు ఇది ప్రేమో లేక ఆకర్షణో తెలుసుకోవడం ఎలా? ఒకవేళ నా ప్రపోజల్‌ని ఓకే చెయ్యకపోతే చదువు మీద దృష్టి పెట్టలేనేమోనని భయంగా ఉంది. ఏం చేస్తే బాగుంటుందో వీలైనంత త్వరగా చెప్పండి సార్‌. దగ్గరలో ఎగ్జామ్స్‌ కూడా ఉన్నాయి, చదువుకుంటాను. దయచేసి మంచి సలహా ఇవ్వండి సార్‌! – మల్లికార్జున్‌

మల్లి.. మల్లి.. మల్లి..... ‘మళ్లీ మళ్లీ ప్రేమించాలా సార్‌?’ నీలూ..! మల్లి.. మల్లి.. మల్లి... ‘అమ్మాయి ఒప్పుకోకపోయినా మళ్లీ మళ్లీ ప్రేమిస్తూనే ఉండాలా సార్‌???’ అది కాదు నీలూ..! మల్లి.. మల్లి.. మల్లి... ఓహో! అర్థమయ్యింది సార్‌..! మల్లికార్జున్‌ పేరు చెబుతుంటే నత్తిగా అనిపిస్తుంది కదా సార్‌??? ఎక్కడ రాంగ్‌ అడ్వైజ్‌ ఇస్తే పాపం మల్లి.. మల్లి.. మల్లికార్జున్‌ డిప్రెస్‌ అయిపోతాడేమోనని భయంగా ఉంది కదా సార్‌?? మళ్లీ.. మళ్లీ.. మళ్లీ.. ఎగ్జామ్‌లో ఫెయిల్‌ అయిపోతాడేమోనని మీరు వర్రీడ్‌ కదా సార్‌?? మళ్లీ ప్రేమలో.. మళ్లీ కెరీర్‌లో.. మళ్లీ లైఫ్‌లో ఫెయిల్‌ అవ్వకూడదని ఆలోచిస్తున్నారు కదా సార్‌??? నేను సింపుల్‌గా ప్రాబ్లమ్‌ సాల్వ్‌ చేసేస్తాను సార్‌! చెప్పమంటారా????’ చె.. చె.. చె... ‘చెబుతా సార్‌..! ఈ క్వశ్చన్, ఆన్సర్‌ రెండూ అమ్మాయిని చదవమంటే పోలా???’

- ప్రియదర్శిని రామ్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top