నన్నడగొద్దు ప్లీజ్‌ | Love doctor Priyadarshini Ram | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Oct 26 2018 1:26 AM | Updated on Oct 26 2018 1:26 AM

Love doctor Priyadarshini Ram - Sakshi

హలో అన్నయ్యా. నేను ఒక అమ్మాయిని టూ ఇయర్స్‌గా లవ్‌ చేస్తున్నాను. నెలరోజుల క్రితం ప్రపోజ్‌ చేశాను. తనకు ఇష్టం లేదని చెప్పింది. మా అమ్మను బాధ పెట్టడం ఇష్టం లేదంటోంది. రీసెంట్‌గా మళ్లీ ప్రపోజ్‌ చేశాను. అప్పుడు ‘నేను ఎవరినీ లవ్‌ చెయ్యను’ అంటోంది. తనకి నేనంటే ఇష్టం ఉందని తన ప్రవర్తనలో తెలుస్తుంది కానీ, ఎప్పుడూ ఏదో ఒక రీజన్‌ చెప్పి వెళ్లిపోతుంది. మొన్న తనే కాల్‌ చేసి.. ‘నువ్వు బాధపడకు, నీకు నాకంటే బెటర్‌ అమ్మాయి దొరుకుతుంది’ అని చెప్పింది. నేను జాబ్‌ తెచ్చుకుని మీ మమ్మీని ఒప్పిస్తాను అని చెబితే.. ‘నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. తనని బాధపెట్టను’ అంటోంది. ఏం చెయ్యాలో అసలు అర్థం కావట్లేదు. దయచేసి మంచి సలహా ఇవ్వండి. – పవన్‌

‘నీకు తాను చెప్పినట్లే మంచి అమ్మాయి దొరుకుతుంది..! ఎంత రఫ్‌ అయిపోయారు సార్‌ మీరు.. పవన్‌ ఏమో ఫుల్‌గా ఫీల్‌ అయిపోయి మీకు రాస్తే... మీరు హార్ట్‌ లేకుండా రఫ్‌ ఆన్సర్‌ ఇస్తున్నారు..! బాధలో ఉన్న ప్రేమికుడికి కొంచెం చల్లటి నీళ్లు ఇవ్వాల్సింది.! మీరేంటి సార్‌ పెట్రోల్‌ పోస్తున్నారు?’ అమ్మాయే చెప్పింది కదా నీలూ..! తన కంటే మంచి అమ్మాయి దొరుకుతుందని!? ‘ఏమో తప్పించుకోవడానికి చెబుతోందేమో..!’ ఆ మాట నేను చెబితే ‘రఫ్‌ అని.. గిఫ్‌ అని’ నన్ను అంటావు కదా నీలూ.. అమ్మాయికి నచ్చకో.. కష్టం చెప్పలేకో.. సంస్కారం ఉన్న నా చెల్లెలు కాబట్టి తిట్టకుండా.. ప్రేమగా దీవిస్తుంది. ‘ఇంకో మంచి అమ్మాయి దొరుకుతుందని భలే చెబుతారు సార్‌..! కానీ పవన్‌కైతే ఆ అమ్మాయే కావాలి!’ అయితే చాలా సింపుల్‌..! అమ్మాయి వాళ్ల అమ్మకు... ‘పవన్‌ నచ్చితే.. అమ్మాయికి కూడా నచ్చుతాడు కదా సార్‌???’ అబ్బబ్బబ్బబ్బా.. నీలూ యు ఆర్‌ టూ గుడ్‌!

- ప్రియదర్శిని రామ్‌ , లవ్‌ డాక్టర్‌

Advertisement
 
Advertisement
Advertisement