నన్నడగొద్దు ప్లీజ్‌ | Love doctor Priyadarshini Ram | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Oct 22 2018 12:24 AM | Updated on Oct 22 2018 12:24 AM

Love doctor Priyadarshini Ram - Sakshi

హాయ్‌ అన్నయ్యా..! నేను మా బావని లవ్‌ చేస్తున్నాను. తనకి కూడా నేనంటే చాలా ఇష్టం. పెళ్లి చేసుకుందామనుకున్నాం. కానీ మా బావ వాళ్ల అమ్మ.. నాతో మాట్లాడినా, నన్ను పెళ్లి చేసుకున్నా చచ్చిపోతాన ంటోంది. దాంతో తను వాళ్ల అమ్మ మాటను కాదనలేక, ఆమెని ఒప్పించలేక చాలా బాధపడుతున్నాడు. ‘మా అమ్మకు ఇష్టంలేకుండా నిన్ను పెళ్లి చేసుకోలేను, ఒకవేళ చేసుకున్నా నిన్ను హ్యాపీగా ఉంచలేను. సారీ’ అంటున్నాడు. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. అందుకే మీకు రాస్తున్నాను. దయచేసి మంచి సలహా ఇవ్వండి అన్నయ్యా! – యువర్‌ సిస్టర్‌

మై డియర్‌ సిస్టర్‌...! నిన్ను ప్రేమించే ముందు ఎంకమ్మ వాళ్ల అమ్మ పర్మిషన్‌ తీసుకున్నాడా? ‘ఏంటి సార్‌..? పిచ్చి క్వశ్చన్‌..? అబ్బాయిలంటే మగాళ్లు సార్‌..! వాళ్లకు ఎవరి పర్మిషన్‌ అక్కర్లేదు! వాళ్లు ఒక్కసారి డిసైడ్‌ చేసుకుంటే... దేవుడు దిగివచ్చినా....mపూజారి రిక్వెస్ట్‌ చేసినా... మొత్తం హోల్‌ విలేజ్‌ కాదన్నా... ఎవరు చెప్పినా వినడు ఈ మగాడు... నాన్న చెప్పినా.. అత్త చెప్పినా.. బాబాయి చెప్పినా.. పిన్ని చెప్పినా...అక్క చెప్పినా.. చెల్లి చెప్పినా.... సార్‌ అర్థమయ్యింది సార్‌..! ఎవడు చెప్పినా వినని మగాడు మెగా లవర్‌..! కానీ ఈ కేసులో అమ్మ మాట వింటున్నాడు కదా సార్‌..??’ అంతా ఎక్స్‌క్యూజెస్‌ నీలూ...! వాడు అమ్మాయిని మోసం చెయ్యాలని డిసైడ్‌ చేసుకున్నాడు. అందుకే.. అమ్మకొట్టుద్ది, నాన్న తిడతాడని స్టోరీస్‌ చెబుతున్నాడు. వెంటనే నా బంగారు సిస్టర్‌ ఈ డర్టీ ఫెలోని మర్చిపోయి హ్యాపీగా జీవించడం మంచిది..! ‘మంచిది..!!’


- ప్రియదర్శిని రామ్‌ , లవ్‌ డాక్టర్‌

Advertisement
 
Advertisement
Advertisement