నన్నడగొద్దు ప్లీజ్‌ | Love doctor Priyadarshini Ram | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Sep 23 2018 1:18 AM | Updated on Sep 23 2018 1:18 AM

Love doctor Priyadarshini Ram - Sakshi

హాయ్‌ అన్నయ్యా..! నేను మా బావని లవ్‌ చేస్తున్నాను. తను కూడా నన్ను లవ్‌ చేస్తున్నాడు. బట్‌ మా నాన్నకు మా పెళ్లి ఇష్టం లేదు. ఎందుకంటే... మా బావ నాకంటే ముందు మా అక్కని లవ్‌ చేశాడు. అందుకే మా నాన్న నన్ను తనకిచ్చి పెళ్లి చెయ్యడానికి ఒప్పుకోవట్లేదు. నాన్నకి ఇష్టం లేకుండా నేను తనని పెళ్లి చేసుకోలేను. పైగా మా బావ మా అక్కని లవ్‌ చేశాడన్న విషయాన్ని నాదగ్గర దాచలేదు. ప్రపోజ్‌ చేసేటప్పుడే చెప్పాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి. మంచి సలహా ఇవ్వండి ప్లీజ్‌. – శ్రీభాను

శ్రీ...! నీకు ఇంకా చెల్లెళ్లూ... కజిన్‌ సిస్టర్స్‌ ఉన్నారా తల్లీ..? ‘ఎందుకు సార్‌ అంత వెటకారం? ఏదో ముందు అక్కయ్యను ప్రేమించాడు. ఇప్పుడు చెల్లెల్ని ప్రేమిస్తున్నాడు. అంత మాత్రాన శ్రీభానూకి ఇంకో సిస్టర్‌ ఉంటే... శ్రీభానుకి కూడా థాంక్యూ వెరీమచ్‌ చెప్పి... సిస్టర్స్‌కి లైన్‌ వేస్తాడనేగా మీ ఫీలింగ్‌?? అంత దుర్మార్గంగా ఎలా ఆలోచిస్తారు సార్‌? లవ్‌ అంటే మీకు అంత లోకువా సార్‌? అసలు ఇంత చీప్‌గా ఎలా ఆలోచిస్తున్నారు సార్‌ మీరు? మీరు శ్రీభాను వాళ్ల డాడీ కంటే దుర్మార్గంగా చేస్తున్నారేంటి సార్‌? ప్లీజ్‌ రిమెంబర్‌ యు ఆర్‌ శ్రీభానూస్‌ బ్రదర్‌..! మిమ్మల్ని ఒక బ్రదర్‌గా రెస్పెక్ట్‌ చేసి మీ సలహా అడిగితే... ‘‘నీకు ఇంకా సిస్టర్స్‌ ఉన్నారా తల్లీ..?’’ అని జోకులు వేస్తారా? పోనీ వాడు తింగరోడు కావచ్చు.

అక్కను చిక్కించుకోలేక చెల్లెల్ని లైన్‌లో పెట్టాడని అనుకోవచ్చు. చెల్లెల్ని వలలో వేసుకుని అక్క మీద రివెంజ్‌ తీర్చుకోవాలనే అనుకోవచ్చు. ఒక మేనిప్యులేటర్‌గా ఇంట్లోకి దూరడానికి చెల్లెల్ని తాళం చెవిగా వాడుకునే యూజ్‌లెస్‌ ఫెలో కావచ్చు. రేపు అల్లుడిగా అదే ఇంట్లో.. కాలు మీద కాలు వేసుకుని మామయ్యగారిని ఇన్‌సల్ట్‌ చెయ్యాలనే అనుకోవచ్చు. ఇవన్నీ మనకెందుకు సార్‌? అమ్మాయి చూసుకుంటుంది. మీరు బ్రదర్‌గా గివ్‌ అడ్వయిజ్‌ అండ్‌ టేక్‌ రెస్పెక్ట్‌ సార్‌!!’ అబ్బబ్బబ్బబ్బా.. నీలూ! యు ఆర్‌ టూ గుడ్‌ ఐ సే!! నీ మాటలు విని నాకు బుద్ధి వచ్చింది. శ్రీభానుకి వచ్చిందో లేదో చూద్దాం!!


- ప్రియదర్శిని రామ్‌ , లవ్‌ డాక్టర్‌

Advertisement
 
Advertisement
Advertisement